ఏసీపీ వేధిస్తున్నాడు | Complaint On ACP Karnataka On Civil Case | Sakshi
Sakshi News home page

ఏసీపీ వేధిస్తున్నాడు

Published Tue, Sep 4 2018 11:12 AM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM

Complaint On ACP Karnataka On Civil Case - Sakshi

డీసీపీకి ఫిర్యాదు అందజేస్తున్న లక్ష్మిజత్తి

కృష్ణరాజపురం : తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ వైట్‌ఫీల్డ్‌ ఏసీపీపై దివంగత మాజీ ఉపరాష్ట్రపతి బీడీ జత్తి కుమారుడు, కోడలు సోమవారం వైట్‌ఫీల్డ్‌ డీసీపీకి ఫిర్యాదు చేశారు. వివరాలు... మాజీ ఉపరాష్ట్రపతి బీడీ జత్తి కుమారుడు డీజీ జత్తితో పాటు అతడి భార్య లక్ష్మీ జత్తిపై కొద్ది కాలం క్రితం అట్రాసిటీ కేసు నమోదైంది. కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన వైట్‌ఫీల్డ్‌ ఏసీపీ సుధామనాయక్, ఎస్‌ఐ సోమశేఖర్‌లు కేసును కొట్టివేస్తామని అందుకు లంచం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారని జత్తి దంపతులు ఆరోపించారు.

దీంతో  కొద్ది కాలం క్రితం ఏసీపీ సుధామనాయక్‌కు రూ.5 లక్షలు, ఎస్‌ఐకి రూ.2 లక్షలు లంచం ఇచ్చామని పేర్కొన్నారు. అయినా కూడా తమ ఇంటికి రోజూ ఫోన్‌ చేస్తూ మానసికంగా ఏసీపీ సుధామనాయక్‌ వేధిస్తున్నారని జత్తి భార్య లక్ష్మీ జత్తి ఆరోపించారు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో ఆయన కాల్స్‌ను స్వీకరించడం మానేసామన్నారు. దీంతో ఒకరోజు తాము ఉంటున్న విల్లాకు వచ్చి తాను కూడా ఇక్కడే విల్లా తీసుకోవాలనుకుంటున్నానని, అందుకు సహకరించాలని మాట కలిపే ప్రయత్నం చేసారని లక్ష్మీ ఆరోపించారు. దీంతో సీనియర్‌ పోలీస్‌ అధికారి సీమంత్‌ కుమార్‌ ఆదేశాల మేరకు వైట్‌ఫీల్డ్‌ డీసీపీ అబ్దుల్‌ వహాద్‌కు ఫిర్యాదు చేసామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement