యువతితో అసభ్య ప్రవర్తన : యువకుడి అరెస్టు | Man arrested for harassing Woman | Sakshi
Sakshi News home page

యువతితో అసభ్య ప్రవర్తన : యువకుడి అరెస్టు

Published Fri, Jun 19 2015 6:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Man arrested for harassing Woman

బంజారాహిల్స్ (హైదరాబాద్) :  ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. మిజోరం రాష్ట్రానికి చెందిన ఓ యువతి(23) బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తోంది. ఎప్పటిలానే గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని ఆటోలో బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో దిగి నందినగర్‌లోని తన గదికి నడిచి వెళ్తోంది.

అయితే గత కొన్ని రోజుల నుంచి నూర్‌నగర్‌కు చెందిన ఎస్‌కె. మౌలాలి ఆమెను వెంబడిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె భయాందోళనలకు గురై అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మౌలాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మౌలాలి పంజగుట్టలోని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో హౌస్‌కీపింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement