youngster arrest
-
ప్రేమ పేరుతో వంచన.. యువకుడి అరెస్ట్
రసూల్‌పుర (హైదరాబాద్): ప్రేమిస్తున్నానంటూ ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెతో సరదాలు తీర్చుకుని గర్భవతిని చేశాడు ఓ మోసగాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ వంచకుడ్ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కంటోన్మెంట్‌లోని మడ్‌ఫోర్ట్ ప్రాంతంలో ఉండే సురేష్ స్థానికంగా ఎనిమిదితో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి గర్భవతిని చేశాడు. ఆమెకు ప్రస్తుతం ఏడవ నెల. దీంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ ఆమె సురేష్‌ను నిలదీసింది. అతను పెళ్లి చేసుకోనంటూ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఉదయం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. -
యువతితో అసభ్య ప్రవర్తన : యువకుడి అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్) : ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. మిజోరం రాష్ట్రానికి చెందిన ఓ యువతి(23) బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. ఎప్పటిలానే గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని ఆటోలో బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో దిగి నందినగర్‌లోని తన గదికి నడిచి వెళ్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి నూర్‌నగర్‌కు చెందిన ఎస్కె. మౌలాలి ఆమెను వెంబడిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె భయాందోళనలకు గురై అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మౌలాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మౌలాలి పంజగుట్టలోని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో హౌస్‌కీపింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.