ప్రేమ పేరుతో వంచన.. యువకుడి అరెస్ట్ | Youngster arrested by cheating lover | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచన.. యువకుడి అరెస్ట్

Published Wed, Aug 19 2015 4:20 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

ప్రేమ పేరుతో వంచన.. యువకుడి అరెస్ట్

ప్రేమ పేరుతో వంచన.. యువకుడి అరెస్ట్

రసూల్‌పుర (హైదరాబాద్): ప్రేమిస్తున్నానంటూ ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెతో సరదాలు తీర్చుకుని గర్భవతిని చేశాడు ఓ మోసగాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ వంచకుడ్ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కంటోన్మెంట్‌లోని మడ్‌ఫోర్ట్ ప్రాంతంలో ఉండే సురేష్ స్థానికంగా ఎనిమిదితో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి గర్భవతిని చేశాడు.

ఆమెకు ప్రస్తుతం ఏడవ నెల. దీంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ ఆమె సురేష్‌ను నిలదీసింది. అతను పెళ్లి చేసుకోనంటూ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఉదయం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement