బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన బాలిక (12) సమీపంలో ఉండే పెద్దమ్మ ఇంటికి వెళ్తుండేది. అదే కాలనీలో నివసించే ఆంజనేయులు అనే యువకుడు ఆమెను చెల్లి అని పిలుస్తూ మాట్లాడుతుండేవాడు.
ఆ చనువుతోనే బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అరవడంతో ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన విషయాన్ని తెలపడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆంజనేయులుపై నిర్భయ కేసుతో పాటు బాలలపై లైంగిక నేరాల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.