కరీంనగర్: మహిళలపై, బాలికలపై ఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఓ వైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ ఘటనలు ఆగడం లేదు. వీరి ఆగడాలను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకవచ్చిన నిర్భయ, అభయ వంటి చట్టాలు ఉన్నా మహిళలకు, బాలికలకు రక్షణ కరువైంది.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని కోరుట్లో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీంతో ఆ బాధితురాలి బంధువులు అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్ జిల్లాలో బాలికపై యువకుడి అత్యాచారం
Published Wed, Dec 4 2013 9:51 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement