అభయమివ్వని నిర్భయ!
చట్టం చేసి చేతులు దులుపుకున్న యంత్రాంగం
మహిళలకు అవగాహన కల్పించని వైనం..
అధికారులకూ తెలియని విషయాలెన్నో
నీరుగారుతున్న ‘నిర్భయ-2013’ చట్టం
మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రవేశపెట్టిన నిర్భయ చట్టంపై సరైన అవగాహన లేక...ఎంతో మంది బాధితులు దాన్ని వినియోగించుకోవడం లేదు. చట్టాన్ని చేసిన యంత్రాంగాలు తమ పని అరుుపోరుుందన్నట్లు చేతులు దులుపుకొన్నారుు. ఫలితంగా ‘నిర్భయ’ అంటే ఏమిటి? అందులో ఏముంది? అది ఎన్ని రకాలుగా రక్షణ ఇస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ప్రయోగించాలి? అనే అంశాలు మహిళలకే కాదు చివరకు దర్యాప్తు అధికారుకూ తెలియవు. దీంతో నిర్భయ చట్టం ఆశించిన ఫలితాలివ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - సాక్షి, సిటీబ్యూరో
సిటీబ్యూరో: కూకట్‌పల్లి పరిధిలోని శ్రీనివాసకాలనీ మెడికల్ సొసైటీలో నివసించే సుజాత ఇంటి యజమాని వేధింపులు, వ్యవహారశైలి భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ‘నిర్భయ’ చట్టమంటే కేవలం అఘారుుత్యాలకు, లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టమనే భావన అనేక మందిలో ఉంది. ఈ కారణంగానే చట్ట పరిధిలో తమకు ఉన్న రక్షణ విషయం తెలియక అర్ధాంతంరంగా తనువు చాలిస్తున్నారు. సుజాత ఉదంతం ఈ కోణంలోనిదే. ఆమెకు ఎదురైన వేధింపులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడింది. నిర్భయ చట్టం గురించి పూర్తిగా తెలిసి...ధైర్యంగా ఫిర్యాదు చేసి ఉంటే సుజాతకు న్యాయం జరిగి ఉండేది. ఏదైనా కొత్త చట్టం తీసుకురావడంలో నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి అనేది పైకి కనిపించే అంశమైతే...అంతర్గతంగా ఉండే దీని ప్రధాన ఉద్దేశం ఆ తరహా నేరాలు పునరావృతం కాకుండా చూడటం. ‘ఢిల్లీ ఉదంతం’తో కదిలిన కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నిర్భయ చట్టం-2013 ఈ కోణంలో ఆశించిన స్థారుు ఫలితాలు ఇవ్వట్లేదు. దీనిపై అతివలకు పూర్తిస్థారుులో అవగాహన ఉండట్లేదు.
‘నిర్భయ’ ప్రకారం ఆయా నేరాలకు శిక్షలు ఇలా...
►ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరిస్తే ఐపీసీ సెక్షన్ 326-ఎ ప్రకారం పదేళ్లు లేదా జీవితఖైదు, జరిమానా
►ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్ 326-బి ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా
► స్త్రీ తత్వానికి భంగం కలిగించేలా, అవమానించేలా, దౌర్జన్యం/బలప్రయోగం చేస్తే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా
►లైంగిక వేధింపులు (ఫోన్ ద్వారా అరుునా), అశ్లీల చిత్రాలు చూపించడం చేస్తే ఐపీసీ సెక్షన్ 354-ఎ ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా
►దౌర్జన్యం/బలప్రయోగం ద్వారా వివస్త్రను చేస్తే ఐపీసీ సెక్షన్ 354-బి ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా
► స్త్రీల రహస్యాంగాలను చాటుగా చూసినా, ఫొటోలు తీసినా ఐపీసీ సెక్షన్ 354-సి ప్రకారం ఏడాది నుంచి ఏడేళ్ల జైలు
►దురుద్దేశంతో స్త్రీని భౌతికంగా కానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా కానీ పదేపదే వెంబడిస్తే ఐపీసీ సెక్షన్ 354-డి ప్రకారం ఐదేళ్ల జైలు, జరిమానా
►మహిళల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేరుుస్తే ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం ఏడు నుంచి పదేళ్ల జైలు, జరిమానా
►ఒకరి కంటే ఎక్కువ మందిని/మైనర్‌ను అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేరుుస్తే గరిష్టంగా 14 ఏళ్లు లేదా జీవితఖైదు విధిస్తారు
►{పభుత్వ ఉద్యోగి లేదా పోలీసు అధికారి అక్రమ రవాణాకు పాల్పడితే మరణించే వరకు జీవిత ఖైదు
►అక్రమ రవాణాకు గురైన వారిని వ్యభిచారంలోకి దింపితే ఐపీసీ సెక్షన్ 370-ఎ ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా
►అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు
►అత్యాచారం కారణంగా లేదా గాయపరిచిన కారణంగా సదరు మహిళ చనిపోతే ఐపీసీ 376-ఎ ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా మరణించే వరకు జీవిత ఖైదు
►న్యాయబద్ధంగా విడిపోరుు వేరుగా నివసిస్తున్న భార్యను బలాత్కరిస్తే ఐపీసీ సెక్షన్ 376-బి ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా
►అధికారాన్ని వినియోగించి స్త్రీలను లొంగదీసుకుంటే ఐసీపీ సెక్షన్ 376-సి ప్రకారం ఐదు నుంచి పదేళ్ల జైలు, జరిమానా
►మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376-డి ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా చనిపోయే వరకు జీవితఖైదు
►ఒకటి కంటే ఎక్కువ సార్లు అత్యాచారం చేస్తే ఐపీసీ సెక్షన్ 376-ఇ ప్రకారం మరణించే వరకు జీవితఖైదు
►మహిళల్ని అల్లరిపెట్టి అవమానపరిస్తే..వేధింపులకు గురిచేస్తే ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా
వాటన్నింటి సమాహారమే...
2012 డిసెంబర్‌లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతంతో యావత్ భారతావనీ గళం విప్పింది. ఢిల్లీ వీధులు దద్దరిల్లే స్థారుులో జరిగిన ఉద్యమంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు వర్మ కమిటీ ఏర్పాటు చేసింది. ఆపై దీన్ని పట్టించుకోని కేంద్రం ఆ కమిటీ సిఫార్సుల్ని పొందు పరచకుండా ‘ఉరి’తో కూడిన ఆర్డినెన్‌సను అమలులోకి తెచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్లమెంట్‌లో చర్చించి నిర్భయ చట్టం తీసుకువచ్చింది. 2013 ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చిన ఈ యాక్ట్‌లో ప్రత్యేకించి ఏర్పాటు చేసినవంటూ పెద్దగా లేవు. అప్పటికే ఐపీసీలో ఉన్న యాసిడ్ దాడులు, ఆత్మగౌరవానికి, స్త్రీ తత్వానికి భంగం కలిగించడం, అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి మహిళా సంబంధిత నేరాలను క్రోడీకరించి ఒకే గొడుకు కిందికి తెస్తూ విసృ్తత పరిచింది. ఒక్కో సెక్షన్‌కు ఎ,బి,సి,డి,ఇ... ఇలా క్లాజ్‌లు చేరుస్తూ విపులీకరించారు.
అధికారులకూ తెలియని అంశాలెన్నో...
నిర్భయ చట్టంలో ఉన్న కీలకాంశాలపై సాక్షాత్తు పోలీసు అధికారులకే అవగాహన ఉండట్లేదు. ఫలితంగా దీని పరిధిలోకి వచ్చే కేసుల్ని సైతం మూస ధోరణిలోనే పాత సెక్షన్ల కిందే నమోదు చేస్తున్నారు. ‘నిర్భయ’లో ఉన్న మూడు అత్యంత సున్నితాంశాల కారణంగా దీని కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వైద్యుల నివేదిక సైతం న్యాయస్థానంలో ఆధారంగా మారుతుంది. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానం సైతం దీని విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి. సాధారణ కేసుల్లో నిందితులకు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ అనే అంశం కలిసి వచ్చి నిర్దోషులుగా బయటపడుతుంటారు. అరుుతే నిర్భయ చట్టం కింద నమోదైన కేసులకు మాత్రం ఇది వర్తించదు. బాధితురాలు చెప్తోంది కాబట్టి కచ్చితంగా నేరం చేసి ఉంటాడనే అంశం పరిగణలోకి వస్తుంది. సాంకేతికంగా దీన్ని ప్రిజెమ్షన్ అంటారు. వీటివల్ల ఈ కేసుల్లో శిక్షల శాతం పెరిగి మరొకరు నేరం చేయడానికి భయపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
ఇవి గుర్తుంచుకోండి...
మహిళలపై జరుగుతున్న దారుణాల్లో సగం కూడా పోలీసుల వరకు రావడం, రికార్డుల్లోకి ఎక్కడం జరగట్లేదు. కొన్ని సందర్భాల్లో అనేక మంది ‘సుజాత’లుగా మారుతున్నారు. దీనికి పరువు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో కారణాలు ఉంటున్నారుు. ఓ బాధితురాలి మౌనంతో వస్తున్న ఈ ఉదాసీనత మరింత మంది ముష్కరులు రెచ్చిపోవడానికి ఊతం ఇచ్చినట్లేనని గుర్తుంచుకోండి. ఈ అంశానికి సంబంధించి చట్టం, పోలీసులు బాధితులకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు.
► మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి పరిధితో సమస్య లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు.
► ఎట్టిపరిస్థితుల్లోనూ బాధితుల పేర్లు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు.
► అవసరమైతే నిందితుల అరెస్టు సంబంధించిన అంశాన్నీ మీడియాకు తెలపరు.
► ఇలాంటి కేసుల్లో వీలున్నంత వరకు మహిళా అధికారిణులకే దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తారు.
► కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీరు పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దర్యాప్తు అధికారులు మీ వద్దకే వస్తారు.
► న్యాయస్థానం కూడా బాధితుల్ని ప్రత్యేకంగా పరిగణిస్తుంది.
►వాదోపవాదనలన్నీ ఇన్ కెమెరా (రహస్య పద్దతి)లోనే జరుగుతారుు.