‘అభయ’ నిందితులను తక్షణమే శిక్షించాలి | Women secretariat employees protest Abhaya rape incident | Sakshi
Sakshi News home page

‘అభయ’ నిందితులను తక్షణమే శిక్షించాలి

Published Thu, Oct 24 2013 6:49 PM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

Women secretariat employees protest Abhaya rape incident

హైదరాబాద్: ‘అభయ’ అత్యాచారం ఉదంతంలో నిందితులను తక్షణమే శిక్షించాలని సచివాలయ మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. అత్యాచారాలకు తెగబడుతున్న మృగాళ్లపై ప్రభుత్వం కఠిణ చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సచివాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. కేవలం చట్టాలు చేయడంతోనే సరిపోదని, ఆ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.

సచివాలయ మహిళా ఉద్యోగ సంఘం ప్రతినిధులు వరలక్ష్మి, సుభద్ర, లలిత మీడియాతో మాట్లాడారు. అత్యాచార నిందితులకు క్యాస్ట్రేషన్ చికిత్స చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టంపై విస్తృత అవగాహన కల్పించి తద్వారా మహిళల పట్ల వేధింపులను నివారించేందుకు ప్రయత్నించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement