abhaya
-
RG Kar Case : నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ ఆస్పత్రి (RG Kar Case) ట్రైనీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో సీల్దా కోర్టు (sealdah court ) సోమవారం మధ్యాహ్నం (జనవరి 20) తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ‘నేను అమాయకుడిని, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారంటూ’ కోర్టుకు తెలిపారు. సంజయ్ రాయ్ వాదనల్ని సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఖండించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. తీర్పు సమయంలో వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ సైతం వైద్యురాలి కేసు ఆరుదైన కేసుల్లో అరుదైన కేసు కేటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు రాయ్‌కు మరణిశిక్ష విధించాలని కోరింది. సీబీఐ వాదనపై సీల్దా కోర్టు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ స్పందించారు. ‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదు. అతనికి (సంజయ్ రాయ్‌కు) జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీల్దా కోర్టు తీర్పుపై అభయ తల్లిదండ్రులు కోర్టు హాలులో ఆందోళన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు కోర్టులను ఆశ్రయిస్తామని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ఉరితీయండిగత నెల డిసెంబర్లో కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరుఫు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. తాజాగా, సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించడంపై కోల్‌కతా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆందోళన కారులు తమ నిరసనల్ని తెలుపుతున్నారు. -
TS: ముగిసిన ‘అభయ హస్తం’ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 8లక్షల 94 వేలు దాటిన దరఖస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. హైదరాబాద్‌లో దరఖాస్తుల సంఖ్య 21 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటికిపైగా గృహస్తుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించారని సీఎస్ శాంతకుమారి అధికారులను ఆదేశించారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: నిందితులకు వారెంట్ జారీ -
TS: అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నోడల్ అధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి పది జిల్లాలకు నోడల్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్నారు. కరీంనగర్ - శ్రీదేవసేన వరంగల్ - వాకాటి కరుణ హైదరాబాద్ - కె.నిర్మల వరంగల్ - వాకాటి కరుణ మహబూబ్‌నగర్ - టి.కె.శ్రీదేవి. ఖమ్మం - రఘునందన్‌రావు. రంగారెడ్డి - శ్రీధర్. మెదక్ - ఎస్.సంగీత. ఆదిలాబాద్ - ఎం. ప్రశాంతి. నల్గొండ - ఆర్.వి.కర్ణన్. నిజామాబాద్ - క్రిస్టినా -
నా భర్తకు 89 ఏళ్లు.. రోజూ అదే ధ్యాస.. నన్ను కాపాడండి
గాంధీనగర్: గుజరాత్ వడోదరలో 89ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసింది 87ఏళ్ల భార్య. వృద్ధ వయసులోనూ ఆయన రోజూ శృంగారం కావాలని తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. మహిళల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 181 అభయంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. తన భర్త నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు విని షాక్‌కు గురైన అభయం టీం వెంటనే రంగంలోకి దిగింది. వృద్ధ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ వయసులో యోగా చేయాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని సూచించింది. వీలైతే సీనియర్ సిటిజెన్ల కోసం ఏర్పాటు చేసిన పార్కులలో సేదతీరాలని చెప్పింది. భార్యను ఇబ్బందిపెట్టవద్దని భర్తకు సూచించి సమస్యను పరిష్కరించింది. తన భర్తకు ఎప్పుడూ అదే ధ్యాస అని, శృంగారానికి ఒప్పుకోకపోతే తనపై కోపపడతాడని భార్య చెప్పింది. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా భర్త పదే పదే బలవంతం చేయడం వల్లే గత్యంతరం లేక ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. చదవండి: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్.. -
ప్రైవేటు వాహనాల్లోనూ మహిళలకు 'అభయ'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు ఉద్దేశించిన ‘అభయ’ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు పిలిచిన టెండర్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించే బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించారు. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిటీకి విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్ల ఎంపిక విధానం, అమలు అంశాల్ని ఈ కమిటీ పరిశీలించనుంది. అభయ ప్రాజెక్టు అమలు బాధ్యత రవాణా శాఖదే అయినప్పటికీ పోలీసు శాఖ సహకారం అవసరం ఉంటుంది. దీంతో పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించింది. మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో గతంలోనే రవాణా శాఖ అభయ ప్రాజెక్టును రూపొందించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం 2015లో రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. చివరకు ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్ రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌తో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. తెలుసుకునే వీలుంది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేందుకు అభయ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. ‘అభయ’ అమలు ఇలా.. - రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. - పోలీసుల సహకారంతో రవాణా శాఖ ఐటీ అధికారులు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు. - రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్సులు అమర్చాలి. - ఈ బాక్సులు అమరిస్తే రవాణా, పోలీస్ శాఖ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. - మహిళలు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. - తొలుత విశాఖ, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రవాణా శాఖ గతంలో నిర్ణయించింది. - ఇందుకు రూ.138 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐఓటీ బాక్సుల్ని రవాణా శాఖ సమకూర్చనుంది. - ఈ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. - ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. - ఆటోల్లో/క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే యాప్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారమిస్తే.. వాహనం ఎక్కడుందో తెలుసుకుని ఇట్టే పట్టుకుంటారు. - కమిటీ సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను పట్టా లెక్కిస్తారు. -
ఏపీలో మహిళల రక్షణకు ‘అభయ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల రక్షణకు ఉద్దేశించి ‘అభయ’ పేరుతో ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ తరహా కేసులు రాష్ట్రంలో ఎక్కడా చోటు చేసుకోకుండా.. ఏ సమయంలోనైనా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం తొలివిడతగా ఏపీకి కేంద్రం రూ.56 కోట్లు కేటాయించింది. ఇదీ ప్రాజెక్టు..: క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేలా ‘అభయ’ ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం ‘అభయ’ మొబైల్ యాప్‌కు రూపకల్పన చేశారు. ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వస్తే క్యాబ్‌లు, ఆటోలకు జీపీఎస్ పరికరాలు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇవేగాక ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలన్నింటిలో జీపీఎస్ పరికరాలు అమర్చాలి. రవాణా, పోలీసుశాఖ సిబ్బంది కాల్‌సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. మహిళలకు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులెదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. తొలుత ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని విశాఖ, విజయవాడల్లో ‘అభయ’ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. -
క్వార్టర్స్‌లో అభయ, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో అభయ, అపూర్వ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని డీఆర్సీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో శనివారం జరిగిన అండర్–12 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ మ్యాచ్‌ల్లో అభయ వేమూరి 8–2తో తన్వి రెడ్డిపై గెలుపొందగా... అపూర్వ వేమూరి 8–0తో శ్రీనిధి రెడ్డిని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో సౌమ్య 8–5తో రిధి చౌదరీపై, సాయి బృంద 8–3తో లక్ష్మీశ్రీపై, సమీనా 8–7 (5)తో శ్రీవల్లి వర్మపై, రత్న సహస్ర 8–0తో దివ్యపై, తిరుమల శ్రీయ 8–0తో ఖుషిరెడ్డిపై, మలిష్క 8–0తో త్రిభువనిపై విజయం సాధించారు. బాలుర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీశరణ్ రెడ్డి 8–2తో త్రిశాంత్ రెడ్డిపై, శ్రీహరి 8–0తో సాకేత రామపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు బాలుర తొలిరౌండ్: కోట శ్రీనాథ్ 8–3తో హృషిక్‌పై, ధరణి దత్త 8–0తో ధీరజ్ రెడ్డిపై, వినీత్ 8–5తో మొహమ్మద్ జైద్ జిహార్‌పై, రాజు 8–5తో రోహిత్ సాయిపై, వేదాంత్ మిశ్రా 8–3తో ఆర్మాన్ మిశ్రాపై, శౌర్య 8–5తో హేమంత్‌సాయిపై, తన్మయ్‌రెడ్డి 8–5తో అనిరుధ్‌పై, మోహిత్ సాయి 8–1తో అనీశ్ జైన్‌పై, అభిషేక్ కొమ్మినేని 8–3తో శాండిల్య పుల్లెలపై, త్రిశూల్8–6తో రోహన్‌పై, సిద్ధార్థ 8–4తో ఆదిత్య రెడ్డిపై, అనీశ్ రెడ్డి 8–3తో ధనుష్ వర్మపై విజయం సాధించారు. బాలికల తొలిరౌండ్: రిధి చౌదరీ 8–7 (1)తో వెన్నెలపై, సాయిబృంద 8–0తో పూజితపై, లక్ష్మీశ్రీ 8–1తో శ్రీమన్య రెడ్డిపై, సమీనా 8–1తో రిషికపై, అభయ 8–0తో తేజ శ్రీవిద్యపై, శ్రీనిధి రెడ్డి 8–6తో మేధశ్రీపై, అపూర్వ 8–0తో సన లతీఫ్‌పై, తిరుమల శ్రీయ 8–4తో జి. శివానిపై, ఖుషిరెడ్డి 8–6తో భారతిపై, త్రిభువని 8–2తో తానియాపై గెలుపొందారు. -
‘అభయ’ కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు
సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పు.. కేసు నమోదైన 209 రోజుల్లోనే వెలువడిన తీర్పు.. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ‘అభయ’పై అత్యాచారం కేసులో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. అభయను కిడ్నాప్ చేసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లుకు 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి బుధవారం తీర్పు చెప్పారు. అంతేగాక నిందితులకు రూ.2వేల చొప్పున జరిమానా విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అభయ(22) గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని మహి ళా హాస్టల్లో ఉంటూ హైటెక్‌సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. 2013 అక్టోబర్ 18న ఆఫీస్‌లో విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్లేందుకు క్యాబ్(ఏపీ09టీవీ ఏ 2762) ఎక్కింది. డ్రైవర్ సతీష్‌తోపాటు అతని స్నేహితుడు వెంకటేశ్వర్లు కలిసి కారును దారిమళ్లించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, కేసు నమోదైన 209 రోజుల్లోనే తీర్పురావడం విశేషం. అంతేగాక నిర్భయ చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన మొట్టమొదటి కేసు ఇదే కావడం మరో విశేషం. తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికాలో ఉన్న సాక్షిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారిం చారు. ఈ కేసులో 42 మంది సాక్షులను నమోదు చేయగా 21 మందిని విచారించారు. కేసును ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో నిరూపించడంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 366, 342, 376-డీతోపాటు క్రిమినల్ లా (సవరణ) చట్టం-2013 ప్రకారం నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవితఖైదు విధించవచ్చని న్యాయమూర్తి నాగార్జున్ తెలిపారు. అయితే నిందితులు సతీష్, వెంకటేశ్వర్లు.. తమకు భార్యాపిల్లలతోపాటు వృద్ధ తల్లిదండ్రులున్నారని, కుటుంబాన్ని పోషించే బాధ్యత తమపైనే ఉన్నదని విన్నవించారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
అభయ కేసులో రేపే తీర్పు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయ (22) కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కేవలం 209 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తైతీర్పు రానుండటంతో పోలీసుల పనితీరుపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. నిందితులకు శిక్షలు పడేలా అత్యంత కీలకంగా భావించే 21 మంది సాక్షులను మాదాపూర్ పోలీసులు ఈ కేసులో చేర్చారు. అలాగే ఘటన జరిగిన సమయంలో ఇన్నార్బిట్మాల్, బిర్లా మైండ్‌స్పేస్ స్కూల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు బాధితురాలికి బాసటగా నిలిచాయి. ఈ కేసులో రాష్ట్రంలోనే తొలిసారిగా అమెరికాలో ఉన్న సాక్షిని జడ్జి నాగార్జున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం గమనార్హం. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బాధితురాలికి అనుకూలంగానే సాక్ష్యాలు ఉన్నాయాని, నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అరెస్టైనప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తీర్పును స్వయంగా వినేందుకు సైబ రాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఎల్బీనగర్ కోర్టుకు హాజరుకానున్నారు. ఆరోజు ఏమైంది... బెంగళూరుకు చెందిన అభయ (22- పేరు మార్చడం జరిగింది) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది. డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు. లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేకు చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది. పునరావృత్తం కాకుండా... ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా ఉండేందుకు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఐదంచెల భద్రతా వ్యవస్థను రూ.6 కోట్ల వ్యయంతో రూపొందించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ పోలిసింగ్ వ్యవస్థను రూపొందించారు. ఫలితంగా నేటి వరకు అభయ ఘటన వంటిది జరగలేదు. కాగా, ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తును పక్కా ప్రణాళికతో త్వరగా పూర్తి చేయించారు. -
'క్యూర్ నెంబర్ వాహనంలోనే ప్రయాణించండి'
హైదరాబాద్ : అభయ ఘటన నేపథ్యంలో పోలీసులు జారీ చేసే 'నా వాహనం సురక్షితం' అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్‌లోనే ఐటీ ఉద్యోగినులు ప్రయాణించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్‌లకు రూ.500 జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రూ. కోట్లతో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. అభయ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అయిదు సూత్రాల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఇలా... ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్నెస్, పొల్యుషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంది. క్యాబ్ వివరాలు క్షణాల్లో... క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్సెట్లో పొందుపరుస్తారు. దాంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు పాల్పడరని అధికారులు ఆశిస్తున్నారు. -
అభయ కేసులో డ్రైవర్ తో సహా మరోవ్యక్తిపై ఛార్జిషీటు దాఖలు
హైదరాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన అభయ కేసులో ఛార్జిషీటు దాఖలైంది.ఈ కేసులో డ్రైవర్ వెంకటేష్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. అక్టోబర్ 18న ఓ యువతి షాపింగ్‌మాల్ నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కగా ఆమెను కిడ్నాప్ చేసి కారు డ్రైవర్ సతీష్, సహచరుడు వెంకటేశ్వర్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే. ఈ ఘటనపై 48 పేజీల ఛార్జీషీటును మాదాపూర్ పోలీసులు మియాపూర్ కోర్టులో దాఖలు చేశారు. గ్యాంగ్‌రేప్ సంఘటనలో నిందితులకు త్వరగా శిక్షలు ఖరారు చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. -
సాక్షి అభయ మొబైల్ అప్లికేషన్స్‌కు మంచి క్రేజ్
-
తేడా వస్తే మరో యుద్ధానికి సిద్ధం: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్‌తో తమ పార్టీ విలీనంపై తగిన సమయంలో స్పందిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే విలీనంపై ఆలోచిస్తామన్నారు. 13 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నామని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం కావాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. విలీనంపై మాట్లాడానికి ఇది తగిన సమయం కాదన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి కొర్రీని అంగీకరించబోమని పునరుద్ఘాటించారు. తేడా వస్తే మరో యుద్ధానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణతో కేంద్రం వ్యవహరించాలన్నారు. తెలంగాణకు సర్వాధికారాలు ఉండాలన్నారు. జీఓఎంకు తమ పార్టీ తరపున నివేదిక ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాని, సోనియా గాంధీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు తాను సీఎం కాబోనని స్పష్టం చేశారు. భారతదేశంలో ఎజెండా లేకుండా నిరాహార దీక్ష ఘనత చంద్రబాబుదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సమన్యాయం అంటే ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తమ పార్టీ బృందాలను పంపుతున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 'అభయ'ను ఘటనను ఆయన ఖండించారు. ఇటువంటి పురనావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అభయ ఘటనపై సీఎం సమీక్ష
హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర అత్యాచారానికి గురైన 'అభయ' ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ ప్రసాదరావుతో పాటు పోలీసు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐటీ కారిడార్‌లో బస్సుల సంఖ్యను పెంచి రాత్రి వేళల్లో కూడా తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ చెప్పారు. ఐటీ ఉద్యోగులు వీలైనంతవరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు ఒంటరిగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి అత్యచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇదిలావుండగా ఆర్టీసీ నిర్వహణ భారం పెరిగిందని ఏకే ఖాన్ పేర్కొన్నారు. ఆర్టీసీ 900 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. -
‘అభయ’ నిందితులను తక్షణమే శిక్షించాలి
హైదరాబాద్: ‘అభయ’ అత్యాచారం ఉదంతంలో నిందితులను తక్షణమే శిక్షించాలని సచివాలయ మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. అత్యాచారాలకు తెగబడుతున్న మృగాళ్లపై ప్రభుత్వం కఠిణ చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సచివాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. కేవలం చట్టాలు చేయడంతోనే సరిపోదని, ఆ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. సచివాలయ మహిళా ఉద్యోగ సంఘం ప్రతినిధులు వరలక్ష్మి, సుభద్ర, లలిత మీడియాతో మాట్లాడారు. అత్యాచార నిందితులకు క్యాస్ట్రేషన్ చికిత్స చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టంపై విస్తృత అవగాహన కల్పించి తద్వారా మహిళల పట్ల వేధింపులను నివారించేందుకు ప్రయత్నించాలని సూచించారు. -
'అభయ'కు చేటు చేసిన చాటింగ్!
'అభయ'పై సామూహిక అత్యాచార ఘటన భాగ్యనగర వాసులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనకు ఏమరపాటు కూడా ఒక కారణమని తెలుస్తోంది. బాధితురాలు ఏమరపాటుగా ఉండడం వల్లే దుండగులు ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. స్వీయరక్షణ విషయంలో 'అభయ' కాస్త అప్రమత్తంగా వ్యవహరించివుంటే కామాంధుల బారి నుంచి బయటపడేదన్న వాదన విన్పిస్తోంది. ఒక్కోసారి మన నిర్లక్ష్యమే నేరగాళ్లకు ఆయుధమవుతుంది. 'అభయ' విషయంలోనూ ఇది రుజువయింది. తన హాస్టల్‌కు వెళ్లేందుకు కిరాయి కారులో ఎక్కిన వెంటనే ఆమె సెల్‌ఫోన్ చాటింగ్‌లో మునిగిపోయింది. కారు ఎటు వెళుతున్నదీ గమనించకుండా స్నేహితుడితో సెల్‌ఫోన్ చాటింగ్‌లో లీనమయింది. ఆమె ఏమరపాటును దుండగులు తమకు అనువుగా మలుచుకున్నారు. కారును దారి మళ్లించి దారుణానికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్ చాటింగ్ నుంచి అభయ తేరుకునేటప్పటికీ ఆలస్యమైపోయింది. సెల్‌ఫోన్ ద్వారా బెంగళూరులోని తన స్నేహితుడి సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. అతడి సలహాతో కేకలు పెట్టడంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్ చేశారు. కేకలు బయటకు విన్పించకుండా కారు అద్దాలను మూసేశారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెను పాడుచేశారు. అడుగడునా కీచక సంతతి పొంచివున్న కంప్యూటర్ కాలంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని 'అభయ' ఉదంతం చాటిచెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అందించిన సౌలభ్యాలకు బానిసలుగా మారి ఆత్మరక్షణ మర్చిపోవద్దని హెచ్చరిస్తోందీ ఘటన. చుట్టుపక్కల గమనించకుండా సెల్ఫోన్లో మునిగి తేలడం నేటి తరంలో చాలా మందికి బలహీనతగా మారడం దురదృష్టకర పరిణామం. స్వీయ రక్షణ గురించి పట్టించుకోకుండా సాంకేతి వెల్లువలో కొట్టుకుపోతుండండం ప్రమాదకర ధోరణిగా మారుతోంది. బెంగళూరులోని స్నేహితుడికి సమాచారం అందించిన 'అభయ' కనీసం పోలీసు నంబర్ 100కు సమాచారమిచ్చినా దుండగులు బరితెగించి ఉండేవారు కాదేమో. చాలా మందికి ఈ నంబర్ ఉందన్న సంగతి తెలియపోవడం శోచనీయం. నేరాల నిరోధానికి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండడం ద్వారా కొన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. తనను కాటేసేందుకు చూసిన ఆటోడ్రైవర్ల కళ్లలో పెప్పర్ పౌడర్ చల్లి ఓ యువతి ఇటీవల బయటపడిన ఉదంతం మనకు గుర్తుండే వుంటుంది. ఏదేమైనా కీచకుల పశుశాంఛకు 'అభయ' బలైంది. ఆత్మరక్షణ పట్ల అతివలు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశముంది. -
దారుణంపై వెల్లువెత్తిన నిరసనలు
దేశ రాజధానిలో ‘నిర్భయ’ ఘటన నుంచి తేరుకోకముందే రాష్ట్ర రాజధానిలో ‘అభయ’ ఘటన జరగడంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఇంత పెద్ద మహానగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దారుణానికి ఒడిగట్టిన కీచకులను ఆషామాషీగా కాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘అభయ’ ఘటనను వ్యతిరేకిస్తూ బుధవారం నగరంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మహిళా సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. భారతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. భారీగా చేరుకున్న మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి రక్షణ కల్పించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళలపై అఘాత్యాయిల నివారణకు ప్రత్యేక చట్టాలు చేసినప్పటికీ లైంగిక వేధింపులు, అత్యాచారాలను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరి దుయ్యబట్టారు. రాజేంద్రనగర్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్జీరంగా వర్సిటీ క్రీడాప్రాంగణం నుంచి ప్రేమావతీపేట బస్తీ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామక ృష్ణ విమర్శించారు. ‘అభయ’ ఘటనను వ్యతిరేకిస్తూ రాంనగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న నగరంలో ‘అభయ’లాంటి ఘటనలు నగరస్థాయిని దిగజారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ను ఉద్ధృతం చేయాలని, బహిరంగప్రదేశాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాల ని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి డిమాండ్ చేశారు. మహిళలపై వేధింపులు,అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గోల్కొండ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహానగరంలో జరుగుతున్న ఘటనలతో మహిళా ఉద్యోగులు ఇంటికొచ్చే వరకు తల్లిదండ్రులు భయపడాల్సిన దుస్థితులు ఏర్పడ్డాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.లక్ష్మణ్ అన్నారు. మాదాపూర్ సైబర్‌టవర్ వద్ద అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు క్యాబ్‌లలో ప్రయాణించొద్దని..ఐటీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ఆర్టీసీ సర్వీసులను పెంచాలని డిమాండ్ చేశారు. -
ఐటీ పిటీ
=‘అభయ’ ఘటనతో ఉలిక్కిపడిన ఐటీరంగం =మహిళా ఉద్యోగుల్లో అభద్రత =ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడం శాపం =భద్రత లేని ఆటోలు, క్యాబ్‌లు =అరకొరగా సీసీ కెమెరాలు =నైట్‌విజన్ కెమెరాలకు దిక్కులేదు =అడుగడుగునా భద్రత డొల్ల సాక్షి, హైదరాబాద్/సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ఐటీ కారిడార్.. చూడ్డానికి అందంగా, అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో ఐటీ ఉద్యోగులు మాత్రం ఆ కారిడార్‌లో అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. ప్రత్యేకించి అమ్మాయిల భద్రత గాలిలో దీపంలా మారింది. ఒక నిఘా, నియంత్రణ లేని పాలకుల నిర్వాకం కొందరి జీవితాల్ని చిదిమేస్తోంది. ఐటీ కారిడార్‌లో నేరగాళ్ల స్వైరవిహారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ‘అభయ’ ఉదంతమే నిదర్శనం. ఇందుకు ఎన్నెన్నో కారణాలు.. నిర్లక్ష్యం కొంత.. ఆదమరుపు మరికొంత.. ఏదైనా ఘటన జరిగినపుడు హడావుడి.. ఆపై మిన్నకుండిపోవడం.. ఫలితంగా హైటెక్ సిటీలో పనిచేసే అమ్మాయిలకు భద్రత కరువైంది. కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఇక్కడ లోపించింది. రాత్రి 8 దాటితే సిటీ బస్సు జాడ ఉండదు. గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నేరాలకు, ఘోరాలకు దారితీస్తోంది. సగర్వంగా తలెత్తుకున్నా.. ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్ర ఐటీ రంగం నిలదొక్కుకుంది. దేశంలో నాలుగో స్థానంలో నిలిచి సగర్వంగా తలెత్తుకుంది. కానీ అదే ఐటీ కారిడార్‌లో పనిచేసే ఓ అమ్మాయి మృగాళ్ల చేతిలో దగాపడిందని తెలిసి మొత్తం సభ్య సమాజం నివ్వెరపోయింది. మహిళా ఉద్యోగులు అభద్రతకు గురయ్యారు. రాష్ట్రం మొత్తం మీద 3,27,000 మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ ఐటీ ఉద్యోగుల్లో వీరి సంఖ్య 11.4 శాతం. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ రంగంలో 3 లక్షల వరకు ఉద్యోగులున్నారు. వీరిలో 30- 40 శాతం మంది మహిళా ఉద్యోగులున్నట్టు అంచనా. దశలవారీగా ఐటీ రంగం విస్తరి స్తుంటే.. అందులోని ఉద్యోగులకు కష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు ప్రజారవా ణావ్యవస్థ విస్తరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఉద్యోగులు అవస్థల పాలవుతున్నారు. ప్రధాన లోపం అదే.. సైబారాబాద్ దాదాపు 52 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఐటీ సంస్థలన్నీ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ) పరిధిలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 3 లక్షల సాధారణ జనా భా నివాసం ఉంటోంది. వీరితోపాటు దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు ప్రధానంగా మాదాపూర్‌లోని సైబర్టవర్స్, సైబర్ పెర్ల్, సైబర్ గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్, ఆర్ఎంజడ్ ఫ్యూచురా, టీసీఎస్ డెక్కన్పార్క్, డెల్, కన్వర్జిస్, వానెన్బర్గ్ ఐటీపార్క్, ఐల్యాబ్స్ క్యాంపస్‌లలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. కొండాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవ ర్, సత్యం సైబర్‌స్పేస్, సత్యం ఇన్ఫోసిటీ, టీసీఎస్ పార్క్, ఎస్ఎంఆర్ టెక్నాలజీస్ తదితర క్యాంపస్‌ల్లోనూ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇవి తొలివిడత విస్తరణలో వచ్చిన సంస్థలు. మలిదశలో గచ్చిబౌలిలో ఐఎస్బీ, ఇన్ఫోసిస్, డీఎల్ఎఫ్ సిటీ, ఎస్డీఈ ప్రమేలా తదితర క్యాంపస్‌లు వచ్చా యి. మణికొండలో మైక్రోసాఫ్ట్, పోలారిస్, విప్రో, కాన్బే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, యూబీఎస్, సీఏ, సియరా అట్లాంటిక్, వట్టినాగులపల్లిలో సత్యం క్యాంపస్.. ఇలా వరుసగా కొత్తవి వచ్చాయి. ప్రస్తు తం తెల్లాపూర్, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లోనూ ఐటీ సెజ్‌లు నెలకొంటున్నాయి. ఐ టీ కారిడార్‌లో నివాస ప్రాంతాలు ఖరీదైనవి కావడంతో ఇక్కడికి దూరంగా ఉండి విధులకు హాజరవుతున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. బస్సులు లేదా ప్రైవేటు వాహనాలే వీరికి దిక్కు. తొలిదశలో ఏర్పాటైన ఐటీ క్యాంపస్‌లకే పూర్తిస్థాయిలో ప్రజారవాణా వ్యవస్థ లేదు. పట్టుమని నాలుగు కి.మీ.దూరంలేని జేఎన్టీయూహెచ్ క్యాంపస్ వరకు కూ డా ఆర్టీసీ బస్సులు నడవవు. ఐటీ ఉద్యోగులంతా ప్రగతినగర్, మియాపూర్, నిజాంపేట, హైదర్‌నగర్‌లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ మార్గాల్లో బస్సులే లేవన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఇక అల్వాల్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ఎక్కాల్సిందే. బోయిన్పల్లి, మేడ్చల్, అల్వాల్, జేబీఎస్, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లేవు. శేరిలింగంపల్లి, నల్లగండ్ల, బీహెచ్ఈల్ తదితర ప్రాంతాలను ఐటీ కారిడార్‌కు కలుపుతూ రవాణా వ్యవస్థ లేదు. ఉప్పల్, సికింద్రాబాద్, కోటి.. ఈ మూడు మార్గాల్లోనే బస్సులు నడుస్తున్నాయి. ఇక రాత్రి వేళ అయితే జాడే ఉండవు. ప్రైవేటే శరణ్యం.. గతంలో షేరింగ్ ఆటోలో ఓ ఐటీ ఉద్యోగినిపై దాడి జరిగినప్పుడు వివిధ శాఖలు కొంత హడావుడి చేసినా ప్రజా రవాణా వ్యవస్థను మాత్రం మెరుగుపరచలేదు. అప్పట్లో మహిళా ఉద్యోగినుల రక్షణకు ఐటీ, పోలీస్ విభాగాలు కొంత సమన్వయంతో పనిచేసినా.. ఆపై మిన్నకుండిపోయాయి. దుర్ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే నివారణ చర్యలపై దృష్టిపెడితే మేలని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. అధికారులతో మాట్లాడాం: మంత్రి లక్ష్మయ్య ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, ఇతర సమస్యలపై ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను వివరణ కోరగా.. ‘ఐటీ ఉద్యోగినిపై జరిగిన లైంగికదాడి ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళలపై ఎక్కడ, ఎలాంటి ఘటన జరిగినా అది దురదృష్టకరమై నదే. గత ఏడాది నుంచే భద్రత విషయంలో ఐటీ ఉద్యోగులకు పలు దఫాలుగా అవగాహన కల్పించాం. ఐటీ సంస్థల మహిళా ఉద్యోగులకు కచ్చితంగా క్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఇదివరకు సూచించాం. ఇకపై కూడా సూచిస్తాం. ఐటీ కారిడార్‌లో మౌలిక వసతులపై మరోసారి సమీక్షించి చర్యలు తీసుకుంటాం’ అన్నారు. ఈ ప్రాంతంలో క్యాబ్లే గతి.. ‘ఈ ప్రాంతంలో షేరింగ్ ఆటోలు, ప్రైవేటు క్యాబ్లే గతి. ఒక్కరే ఆటో ఎక్కాలంటే చిన్నచిన్న రూట్లలోనే రూ. 150 వరకు అడుగుతున్నారు. ప్రధాన రూట్లలోనే బస్సుల్లేవు. సైబర్ టవర్స్ వరకు ఉన్నా.. మలిదశలో విస్తరించిన ఐటీ క్యాంపస్‌ల వరకు బస్సులు లేవు. రాత్రివేళ అసలే లేవు..’ - నరేంద్రకుమార్, ఐటీ రిక్రూటింగ్ సంస్థ మినీ బస్సులైనా... ‘ఐటీ సంస్థలు ఉన్న ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ చాలా ఎక్కువుంది. అమ్మాయిలు బైక్‌పై వెళుతుంటేనే పక్క నుంచి అరుపులు, కామెంట్లు వినిపిస్తుంటాయి. కనీసం మినీ బస్సులైనా నడిపిస్తే అమ్మాయిలకు భరోసా ఉంటుంది. అన్ని సంస్థల్లో క్యాబ్ వ్యవస్థ లేదు. విభిన్న షిఫ్టుల్లో పనిచేయాలి. రాత్రివేళలో రహేజా నుంచి గచ్చిబౌలి మార్గంలో కనీసం విద్యుత్తు దీపాలు కూడా వెలగవు. నిరంతరం బస్సు సౌకర్యం, పోలీస్ గస్తీ ఏర్పాటుచేయాలి’ - స్రవంతి, ఐటీ ప్రోగ్రామర్ -
ఆగని ఆకృత్యాలు.. బాలికపై యువకుడి అత్యాచారం
* నిజామాబాద్ జిల్లాలో బాలికపై యువకుడి అత్యాచారం * ఖమ్మం జిల్లాలో వివాహితపై ఆటోడ్రైవర్ల గ్యాంగ్ రేప్ * మెదక్ జిల్లాలో వదినపై మరిది అత్యాచార యత్నం.. హత్య * కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లైంగికదాడికి యత్నాలు సాక్షి, నెట్వర్క్ : మొన్న ఢిల్లీలో నిర్భయ, నిన్న హైదరాబాద్‌లో అభయలపై అత్యాచార ఘటనలు మరువక ముందే తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల మృగాళ్ల అకృత్యాలు వెలుగుచూస్తున్నాయి. కాగా, ఇందులో ఖమ్మంలో జరిగిన రెండు ఘటనలతోపాటు కరీంనగర్లో విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించింది ఆటోడ్రైవర్లే కావడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి... - నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం బాలానగర్ వడ్డెరకాలనీలో నివాసముండే బాలిక (12) ఏడో తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం ఆమె స్థానిక పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా బోదాసు బాలకృష్ణ అనే యువకుడు నోటు బుక్కులిస్తానని నమ్మించి ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. కూలీకి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే బాలిక ఏడుస్తూ విషయం చెప్పడంతో వారు ఆ యువకుడిని నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ళ ఖమ్మంజిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన ఓ వివాహిత(26) కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయి రెండేళ్లుగా తన కుమార్తెతో కలిసి తల్లి గారింట్లో ఉంటోంది. కాగా, ఈనెల 19వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్లు లక్ష్మణ్, విజయ్ ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ‘అరిస్తే నీ కుమార్తెను చంపుతామని’ బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆమె ఆలస్యంగా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. - ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన ఓ యువతి(19) ఖమ్మంలోని త్రీటౌన్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కింది. అందులో ఓ మహిళ , మరో వ్యక్తి ఉన్నారు. అయితే, ఆటోను దారిమళ్లించడంతో ఆ యువతి కేకలు వేసింది. దీంతో ఆటోలో ఉన్న మహిళతో పాటు మరో వ్యక్తి యువతి నోరు మూశారు. గోపాలపురం వద్ద నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించగా స్పృహ కోల్పోయింది. భయపడిన వారు ఆమె చెవి దిద్దులు తీసుకొని పరారయ్యారు. - మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కాశమోళ్ల సుజాత(27)పై ఆమె వరుసకు మరిది అయిన చందర్ కన్నేశాడు. ఓ రోజు అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేనిది చూసి మద్యం సేవించి సుజాత నోటికి లుంగీ, టీ షర్టు చుట్టి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. - కరీంనగర్ నగర శివార్లలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థిని (15) దసరా సెలవులకు ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లి బుధవారం బాబాయితో కలిసి తిరిగి వచ్చింది. ఆకలేస్తున్న ఆమెకు టిఫిన్ తినిపించిన బాబాయి ఓ ఆటో మాట్లాడి విద్యార్థిని పాఠశాల వద్ద దింపమని చెప్పి ఇంటికెళ్లిపోయాడు. ఆటో ఎక్కిన విద్యార్థిని ఆటో డ్రైవర్లో మాటల్లో పెట్టి దారి మళ్లించి రేకుర్తి కంటి ఆస్పత్రి పక్కన ఉన్న చెరువు వద్దకు తీసుకువెళ్లి అమెపై అత్యాచారానికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన విద్యార్థిని అతడిని తోసేసి పారిపోయి చెట్ల పొదల్లో దాక్కుంది. అరగంట తర్వాత నడుచుకుంటూ రోడ్డుపైకి రాగా, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆటోడ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆమెకు ‘అభయ’మివ్వండి
హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడిన వారిని ఉరి తీయాలంటూ ఖమ్మంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం, సత్తుపల్లిలో వైఎస్సార్సీపీ, విద్యాసంస్థలు, లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో బుధవారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం మయూరిసెంటర్ నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ప్రదర్శన జడ్పీ సెంటర్ వరకు కొనసాగింది. అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ‘మహిళా చట్టాల అమలులో పారదర్శకత లోపించడం వల్లే మృగాళ్లు పేట్రేగిపోతున్నారని’ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఖమ్మం నగర కన్వీనర్ కొత్తగుండ్ల శ్రీలక్ష్మి అన్నారు. అభయపై లైంగికదాడికి పాల్పడిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సత్తుపల్లిలోని రింగ్సెంటర్లో మానవహారం నిర్మించారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రతి డివిజన్‌కు మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని తహశీల్దార్ నర్సింహారావు అన్నారు. లైంగిక దాడులు జరగకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని.. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎంపీడీఓ రమాదేవి కోరారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు జమలాపురం రామకృష్ణ, నగర ట్రేడ్ యూనియన్ నాయకులు పత్తి శ్రీను, జిల్లా మహిళా నాయకురాలు కీసర పద్మజారెడ్డి, షర్మిలాసంపత్, కొంగర జ్యోతీర్మయి, యశోద, శాంతి, లత, మతకమ్మ, సఖీనా, కోయ రేణుక పాల్గొన్నారు. సత్తుపల్లిలో గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ దొడ్డా శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపల్, మండల కన్వీనర్లు కోటగిరి మురళీకృష్ణారావు, పాలకుర్తి యాకోబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి శ్రీనివాసరెడ్డి, నాయకులు గాదిరెడ్డి రాంబాబురెడ్డి, మలిరెడ్డి మురళీరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్కె మౌలాన, సత్యవతి పాల్గొన్నారు. -
గ్యాంగ్‌రేప్ నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: సంచలనం కలిగించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభయపై గ్యాంగ్‌రే ప్ కేసులో నిందితులను మాదాపూర్ పోలీసులు బుధవారం మియాపూర్‌లోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సత్యనారాయణ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితులైన కారు డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లును విచారించేందుకు రెండురోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 27,28 తేదీల్లో వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది. అనంతరం పోలీసులు వారిని మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలోని కంది జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను.. ముసుగులు వేసి కాళ్లు, చేతులకు సంకెళ్లతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జిల్లా జైలుకు తీసుకువచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా జైలు సూపరింటెండెంట్ పి.నాగేశ్వర్‌రెడ్డి నిందితులను ప్రత్యేక సెల్‌కు తరలించారు. తోటి ఖైదీలు దాడి చేసే అవకాశముందనే అనుమానంతో ప్రత్యేక సెల్లో ఉంచి భద్రత ఏర్పాటు చేశామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. నేడు లైంగిక సామర్థ్య పరీక్షలు: కోర్టు ఆదేశాల మేరకు గురువారం నిందితులకు లైంగిక సామర్థ్య పరీ క్షలు నిర్వహించనున్నారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాల నూ సేకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అభయ షాపింగ్ చేసిన ఇనార్బిట్ షాపింగ్ మాల్ మొదలు.. మైండ్‌స్పేస్ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్‌లోని టోల్గేట్, కొల్లూరు టోల్గేట్ వద్ద గల ప్రత్యక్ష సాక్షుల వివరాలను సేకరిస్తున్నారు. కారును డ్రైవర్ ఎలా ఉపయోగిస్తున్నాడో తెలుసుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించిన సీపీ అగర్వాల్ (ట్రావెల్స్ నుంచి అద్దెకు తీసుకున్న వ్యక్తి)పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిందితుల తరఫున వాదించం: న్యాయవాదులు ఈ కేసులో నిందితుల బెయిల్‌కు సహకరించరాదని రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ తీర్మానించింది. అభయపై లైంగిక దాడికి నిరసనగా కొత్తపేటలోని కోర్టు భవనం ముందు బార్ అసోసియేషన్ నాయకులు, పలువురు మహిళా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజి రెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దేవరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శి సునీత, జాట్ అధ్యక్షుడు నరేష్కుమార్ పాల్గొన్నారు. నిందితుల తరఫున ఎవరూ వాదించరాదని మియాపూర్ బార్ అసోసియేషన్ తీర్మానించినట్లు నాయకులు జి.శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలు తెలిపారు. -
'అభయ' కేసులో బార్ అసోసియేషన్ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం
సుమారు ఏడాది క్రితం దేశ రాజధానిలో 'నిర్భయ' ఉదంతాన్ని పోలిన మరో దుర్ఘటన రాష్ట్ర రాజధానిలో జరగటం సభ్య సమాజాన్ని కలవరపాటుకి గురిచేసింది. 'అభయ 'గా పోలీసులు వ్యవహరిస్తున్న ఈ కేసులో నేర తీవ్రత విషయంలో తేడా ఉన్నప్పటికీ, ఆ అఘాయిత్యం జరిగిన తీరు ఆడపిల్లల భద్రతపై కొత్త భయాలు రేపింది. ఇదిలా ఉండగా, అభయ కేసు నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో ప్రజలు భావోద్రేకాలకి గురౌతారు. ఆ ఆవేశమే యాసిడ్ దాడి చేసిన నేరస్తుడిని ఎన్కౌంటర్ ద్వారా హతం చేయాలని, ఉగ్రవాద దుశ్చర్యలకి పాల్పడిన వ్యక్తిని విచారణ లేకుండా ఉరితీయాలని, రేప్ చేసిన వాడిని నపుంసకుడుగా మార్చాలని డిమాండ్లు చేయిస్తుంది. వ్యక్తులు లోనయ్యే ఇటువంటి ఆవేశకావేశాలకి వ్యవస్థలు లోను కాకూడదని సుప్రీం కోర్టు పలుసార్లు వ్యాఖ్యానించింది. తాజాగా, అభయ కేసు విషయానికి వస్తే, నిందితులైన డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లు తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. సదరు బార్ అసోసియేషన్ ఈ నిర్ణయం ద్వారా బహుశా ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచుకుంది: అభయ కేసులో నిందితుల తరఫున వాదించడమంటే అన్యాయానికి వకాల్తా పుచ్చుకున్నట్టే కాబట్టి, దానిని ఆ బార్ అసోసియేషన్‌లో సభ్యులైన న్యాయవాదులు అందరూ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా, తాము అప్పటి వరకీన్యాయం వైపే నిలబడ్డామని, అన్యాయం పక్షాన ఏనాడూ లేనేలేమని. ఒకవేళ న్యాయం పట్ల వారి నిబద్ధత నిజమే అని నమ్మాల్సి వచ్చినా, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకునే హక్కు మాత్రం బార్ అసోసియేషన్‌కు లేదనే చెప్పుకోవాలి. కోర్టులో న్యాయం పొందటం దేశంలోని ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ఆ రాజ్యాంగ హక్కు కాలరాచే తీర్మానం చేయడానికి బార్ అసోసియేషన్‌కు హక్కు లేదని పలు సందర్భాలలో సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. "మీ అంతట మీరే చట్టము, తీర్పు కాబోరని" దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో చేసిన హితవుల్ని బార్ అసోసియేషన్లు పెడచెవిన పెట్టడానికి కారణం- అటువంటి సంచలనాత్మక తీర్మానాల ద్వారా మీడియాలో వచ్చే ప్రచారమే. -
'అభయ' నిందితులకు 5వరకూ రిమాండ్
హైదరాబాద్ : 'అభయ' కేసు నిందితులను పోలీసులు బుధవారం మియాపూర్ లోని తొమ్మిదవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అలాగే రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చారు. కాగా నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది. ఢిల్లీ నిర్భయ కేసును తలపించేలా హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు కారు డ్రైవర్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సతీష్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా బాధితురాలికి సంబంధించిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆమెకు పోలీసులు‘అభయ’ అనే పేరు పెట్టారు. మరోవైపు అభయ కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. నిందితులు ఇద్దరూ కారు డ్రైవర్లే: పీయూష్ అనే వ్యక్తి ఈ కారును 24X7 ట్రాన్స్‌లైన్ ట్రావెల్స్‌కు అద్దెకిచ్చాడు. అలెగ్జాండర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్న సీపీ అగర్వాల్ దానిని వాడుతున్నారు. వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్ (30) డ్రైవర్. ఈ కారు డ్రైవర్ సతీషే నిందితుడిగా రూఢీ చేసుకున్న పోలీసులు అతడికి అదుపులోకి తీసుకుని విచారించారు. తనతో పాటు కారులో ఉన్నది నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన తన స్నేహితుడు, కారు డ్రైవర్ నెమ్మడి వెంకటేశ్వర్లు (28)గా సతీష్ వెల్లడించాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. వీరిద్దరూ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నారు. నిందితులపై ఐపీసీ 363, 364, 365, 366, (కిడ్నాప్) 376 (డి) (గ్యాంగ్‌రేప్) సెక్షన్లు, 2013 నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
'అభయ' నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయం
హైదరాబాద్: అభయ కేసు నిందుతుల తరఫున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. బెంగళూరుకు చెందిన అభయ అనే యువతిపై ఈ నెల 18న ఇద్దరు డ్రైవర్లు అతి దారుణంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులైన డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లు తరపున కోర్టులో వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, అభయ అత్యాచార ఘటనకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఈరోజు సచివాలయంను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అభయ:మహిళల రక్షణ గాల్లో దీపమేనా?
-
అభయ:మహిళల పై ఆగని లైంగిక దాడులు
-
అభయ:ఈ సమాజంలో ఇక మార్పు రాదా?
-
అభయకు కాళరాత్రిగా మిగిలిన శుక్రవారం