హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడిన వారిని ఉరి తీయాలంటూ ఖమ్మంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం, సత్తుపల్లిలో వైఎస్సార్‌సీపీ, విద్యాసంస్థలు, లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో బుధవారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం మయూరిసెంటర్ నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ప్రదర్శన జడ్పీ సెంటర్ వరకు కొనసాగింది. అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ‘మహిళా చట్టాల అమలులో పారదర్శకత లోపించడం వల్లే మృగాళ్లు పేట్రేగిపోతున్నారని’ వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం ఖమ్మం నగర కన్వీనర్ కొత్తగుండ్ల శ్రీలక్ష్మి అన్నారు.
అభయపై లైంగికదాడికి పాల్పడిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సత్తుపల్లిలోని రింగ్‌సెంటర్లో మానవహారం నిర్మించారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రతి డివిజన్‌కు మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని తహశీల్దార్ నర్సింహారావు అన్నారు. లైంగిక దాడులు జరగకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని.. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎంపీడీఓ రమాదేవి కోరారు.
ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు జమలాపురం రామకృష్ణ, నగర ట్రేడ్ యూనియన్ నాయకులు పత్తి శ్రీను, జిల్లా మహిళా నాయకురాలు కీసర పద్మజారెడ్డి, షర్మిలాసంపత్, కొంగర జ్యోతీర్మయి, యశోద, శాంతి, లత, మతకమ్మ, సఖీనా, కోయ రేణుక పాల్గొన్నారు. సత్తుపల్లిలో గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ దొడ్డా శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ మున్సిపల్, మండల కన్వీనర్లు కోటగిరి మురళీకృష్ణారావు, పాలకుర్తి యాకోబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి శ్రీనివాసరెడ్డి, నాయకులు గాదిరెడ్డి రాంబాబురెడ్డి, మలిరెడ్డి మురళీరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్‌కె మౌలాన, సత్యవతి పాల్గొన్నారు.
ఆమెకు ‘అభయ’మివ్వండి
Published Thu, Oct 24 2013 1:08 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement