'అభయ' నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయం | Bar association resolves not to argue on behalf of ‘Abhaya’ accused | Sakshi
Sakshi News home page

'అభయ' నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయం

Published Wed, Oct 23 2013 2:57 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

అభయ కేసులో నిందితులు సతీష్, వెంకటేశ్వర్లు - Sakshi

అభయ కేసులో నిందితులు సతీష్, వెంకటేశ్వర్లు

హైదరాబాద్: అభయ కేసు నిందుతుల తరఫున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. బెంగళూరుకు చెందిన అభయ అనే యువతిపై ఈ నెల 18న ఇద్దరు డ్రైవర్లు అతి దారుణంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులైన డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లు తరపున కోర్టులో వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా, అభయ అత్యాచార ఘటనకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఈరోజు సచివాలయంను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement