రక్షకుడు కాదు.. భక్షకుడు | Constable block mailing to woman | Sakshi
Sakshi News home page

రక్షకుడు కాదు.. భక్షకుడు

Published Sun, Mar 11 2018 8:00 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

Constable block mailing to woman - Sakshi

సాక్షి, కర్ణాటక(బళ్లారి): కంచె చేను మేస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ మహిళ రెండేళ్లుగా నరకం అనుభవించింది. ఏదైనా నేరాలు, ఘోరాలు, ఎక్కడైనా అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయడం సహజమే. అయితే అదే పోలీసు తప్పుటడుగులు వేయడంతో జిల్లా పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని హొస్‌పేట పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న వెంకటేశ్‌ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే పటేల్‌ నగర్‌లోని తన పక్కంటిలో నివాసం ఉంటున్న ఓ మహిళ స్నానం చేసే, బట్టలు మార్చుకునే దృశ్యాలను వీడియో తీశాడు. 

వాటిని అడ్డుపెట్టుకొని తనను కలవకపోతే ఆ వీడియోను అందరికీ షేర్‌ చేస్తానని బెదిరించసాగాడు. ఈ విషయాన్ని సదరు మహిళ భర్తకు తెలపడంతో అతను పోలీసును నిలదీశాడు. దీంతొ మీ షాపులో అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్లు కేసు పెడతానని బెదిరించి అతనిని నోరు మూయించాడు. నీచ పోలీసు ఆగడాలు పేట్రేగిపోవడంతో సదరు మహిళ పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. ఈ విషయం​తెలియగానే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వెంకటేశ్‌ పరారయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement