
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్‌లో ఆరా తీశారు. బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
చదవండి: (Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం)
కాగా, 88 ఏళ్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment