
బీజింగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమంగా మారినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం వైద్య నిపుణుల బృందాన్ని పంపడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చైనా ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలే కోలుకున్నాడని దక్షిణ కొరియాకు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే కిమ్ జోన్ ఉన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment