
బుద్ధదేవ్ భట్టాచార్య (ఫైల్)
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 2000 నుంచి 2011 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన భట్టాచార్జీ, తన భార్యతో కలిసి కోల్‌కతాలోని రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, లోబీపీ కారణంగా 75 ఏళ్ల బుద్ధదేవ్‌ను శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కౌశిక్ బసు మాట్లాడుతూ.. బుద్ధదేవ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఏడుగురు వైద్యుల బృందం నిత్యం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.