
లక్నో: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్తితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వుడ్‌ల్యాండ్ హాస్పిటల్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉదయం బుద్ధవేవ్ ఛాతీ భాగానికి సీటీ స్కాన్ తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. సీనియర్ వైద్య నిపుణల బృందం భట్టాచార్యకు చికిత్స అందిస్తుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
అయితే మొత్తం మీద బుద్దదేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు. రక్తపోటు అదుపులోకి రావడంతో చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని చెప్పారు. కాగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో శనివారం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటట్‌లో చేరని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు.
చదవండి: పార్లమెంట్‌లో ఆరని మణిపూర్ మంటలు..
Comments
Please login to add a commentAdd a comment