సాక్షి,న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆర్మీ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌ను ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బైపాస్ సర్జరీ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో మార్చి 30న ఏయిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
కాగా శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో ఆయనను వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ కృతజ్ఙతలు తెలియజేశారు.
The President has been under observation after a routine medical checkup. He thanks all who enquired about his health and wished him well.
— President of India (@rashtrapatibhvn) March 27, 2021
Comments
Please login to add a commentAdd a comment