సాక్షి, హైదరాబాద్ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రి లో చేరిన ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య కోలుకున్నారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు బంధువులు చెప్పుతున్నారు. రేపు కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఆసుపత్రి ప్రాంగణంలో రామయ్య మొక్కలు నాటుతారని తెలుస్తోంది. ఈనెల 13న రెడ్డిపల్లిలోని తన నివాసంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గురైన రామయ్యను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ రెండు గంటల పాటు చికిత్స జరిగినప్పటకీ.. మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రామయ్య అస్వస్థతకు గురయ్యారని తెలుసుకోని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందారు. ఆయన తోందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు.
నిరంతరం మొక్కల గురించి ఆలోచించే రామయ్య.. గత కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు వస్తున్నారు. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని ఇటివలే సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకోచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. రామయ్య కోలుకున్నారన్న విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment