vanajeevi Ramayya
-
వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ‘కేసు వద్దు.. మొక్కలు నాటించండి’
ఖమ్మం వైద్యవిభాగం: తన వాహనాన్ని ఢీకొట్టిన వాహనదారుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఆయనతో 100 మొక్కలు నాటించాలని బుధవారం రెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘పద్మశ్రీ’ గ్రహీత వనజీవి రామయ్య రాష్ట్ర మంత్రులను కోరారు. మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామయ్యను మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రామయ్య పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లును ఆదేశించారు. రామయ్యను పరామర్శించిన వారిలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ గౌతమ్ తదితరులు ఉన్నారు. -
పద్మశ్రీ వనజీవి రామయ్యకు యాక్సిడెంట్..
సాక్షి, ఖమ్మం: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రామయ్యను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యా కాలు, చేతి, తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వనజీవి రామయ్యను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో రామయ్యకి జరిగిన రెండో రోడ్డు ప్రమాదం ఇది. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ నేపథ్యంలో రామయ్యకు కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. వనజీవి రామయ్యను ఆదుకుంటాం: మంత్రి హరీష్ రావు వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వనజీవి రామయ్య ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని తక్షణమే మంత్రి స్పందించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. రామయ్యకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. చదవండి: Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే! -
వనజీవి రామయ్యకు ప్రమాదం, ఎడమ కాలుకి గాయం
సాక్షి, ఖమ్మం: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రామయ్య ఏడమ కాలుకు తీవ్ర గాయమైంది. ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లిలోని బైపాస్ సమీపంలో మొక్కలను నీళ్లు పోయడానికి బైక్ పై వెళ్లుతు ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. రామయ్యను పరీక్షించిన వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ వైద్యుల మాటలు కూడా వినకుండా ఇబ్బందిపడుతునే మొక్కలను నీళ్లు పోయడానికి వెళుతున్నారు. అయితే తాను నాటిన మొక్కలకు నీళ్లు పోయకపోతే అవి చనిపోతాయని రామయ్య చెబుతున్నారు. చదవండి: జీవో 111ను రద్దు వినాశనానికి దారితీస్తుంది: రాజేంద్రసింగ్ -
వనజీవి రామయ్యకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
-
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వనజీవి రామయ్య
సాక్షి, ఖమ్మం: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి వైద్యులు ప్రత్యేక వైద్య సేవలందించారు. ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో రామయ్య ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని రామయ్యకు సూచించారు. విశ్రాంతి తీసుకోవడం అవసరం కాగా ఇటీవల వనజీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గడిచిన మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు అస్వస్థతకు గురయ్యారు రామయ్య. ప్రస్తుతం ఆయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. హరితహరంలో భాగంగా రామయ్య గ్రామాల్లో తిరుగుతు చెట్లు నాటుతు ఉండటం వల్ల శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామయ్య బయట తిరగకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరమన్నారు. వయసు భారం దృష్ట్య రామయ్య కోన్ని ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుతున్నారన్నారు. కాగా గత కొంతకాలంగా వనజీవి రామయ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు. అయితే నిరంతరం మొక్కల గురించి ఆలోచించే ఆయన.. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకొచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. -
కోలుకున్న వనజీవి రామయ్య
-
కోలుకున్న వనజీవి రామయ్య
సాక్షి, హైదరాబాద్ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రి లో చేరిన ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య కోలుకున్నారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు బంధువులు చెప్పుతున్నారు. రేపు కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఆసుపత్రి ప్రాంగణంలో రామయ్య మొక్కలు నాటుతారని తెలుస్తోంది. ఈనెల 13న రెడ్డిపల్లిలోని తన నివాసంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గురైన రామయ్యను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ రెండు గంటల పాటు చికిత్స జరిగినప్పటకీ.. మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రామయ్య అస్వస్థతకు గురయ్యారని తెలుసుకోని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందారు. ఆయన తోందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. నిరంతరం మొక్కల గురించి ఆలోచించే రామయ్య.. గత కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు వస్తున్నారు. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని ఇటివలే సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకోచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. రామయ్య కోలుకున్నారన్న విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పద్మశ్రీ వనజీవి రామయ్యకు అస్వస్థత
సాక్షి, ఖమ్మం : వృక్ష ప్రేమికులు, పద్మశ్రీ వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ని శనివారం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వనజీవి రామయ్యకు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను వైద్యులను ఆదేశించారు. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్య.. వనజీవిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
పచ్చదనమంటే ప్రాణం: వనజీవి రామయ్య
‘భవిష్యత్ తరాలు బాగుండాలనేదే నా తపన.. తాపత్రయం. పల్లెలు, పట్టణాలు, రహదారులు పచ్చదనంతో నిత్యం నిండుగా కనిపించాలి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి.. సంరక్షిస్తే అవి మహా వృక్షాలవుతాయి. గాలి, నీడతోపాటు ఒక్కో మొక్కలో ఒక్కో ప్రత్యేకమైన ఔషధ గుణాలుంటాయి. అలాగే పూలు, పండ్లు మానవ జాతి అవçసరాలను తీరుస్తాయి. ఖాళీ ప్రదేశాలు, ఇంటి పరిసరాలు, నిరుపయోగమైన ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి. తల్లిదండ్రులు.. పిల్లలకు మొక్కల ఆవశ్యకత, వాటి ఉపయోగాలపై వివరించండి’ అంటూ మంగళవారం తనికెళ్లలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తన అనుభవాలను పంచుకున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షి, ఖమ్మం: ప్రశ్న: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంపై మీ అభిప్రాయం? రామయ్య: హరితహారం మంచి కార్యక్రమం. మొక్కల పెంపకం చేయడం అభినందించదగిన అంశం. అయితే నాటిన మొక్కలను పూర్తిగా సంరక్షించినప్పుడే ఫలితం ఉంటుంది. అప్పుడే అవి భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రశ్న: అసలు మొక్కలు నాటాలనే ఆలోచన మీకెలా వచ్చింది? రామయ్య: నా చిన్నతనంలో 5వ తరగతి చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుడు మల్లేశం బోధించిన మొక్కల పెంపకంతో లాభాలు అనే పాఠం నాలో ఒక మహత్తర కార్యానికి అంకురార్పణ చేసింది. ఈ ఆలోచనను నా ఇంటి నుంచే ప్రారంభించాను. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాను. ప్రశ్న: ఎన్నేళ్ల నుంచి మొక్కలు నాటుతున్నారు? రామయ్య: గత 48 ఏళ్ల నుంచి మొక్కలు నాటుతూనే ఉన్నా. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా.. అక్కడ తప్పనిసరిగా మొక్కలు, చెట్లు ఉండాల్సిందే. ఎందుకంటే చెట్లు లేనిదే మానవ మనుగడ లేదు. భూమిపై నివసించే జీవకోటి రాశులకు పుట్టింది మొదలు చనిపోయేంత వరకు చెట్లతోనే పని. ప్రశ్న: మొక్కల పెంపకానికి మీరు చేస్తున్న ప్రచారమేంటి? రామయ్య: వనాల పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా. ఏ శుభ కార్యానికి వెళ్లినా బహుమతిగా మొక్కలనే అందించి.. నాటమని చెబుతుంటా. నా మనుమరాళ్లకు హరిత లావణ్య, చందనపుష్ప అంటూ మొక్కల పేర్లు పెట్టాను. వన రక్షణపై వెయ్యి వరకు వన సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర తెలుపుతూ చెక్కాను. ఏ మొక్కను చూపించినా ఆ మొక్క ఉపయోగాన్ని చెప్పగలను. ముందు తరాల ప్రాణవాయువు కోసం మొక్కల పెంపకమే అవసరమని ఊరూరా ప్రచారం చేస్తున్నా. ప్రశ్న: ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు? రామయ్య: చిన్నతనం నుంచి ఇప్పటివరకు కోటిన్నర మొక్కలు నాటా. ప్రభుత్వ స్థలాలు, ఆలయాలు, పాఠశాలలు, రోడ్ల వెంబడి స్థలంలో మొక్కలు నాటా. నాయుడుపేట నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి రెడ్డిపల్లి గ్రామం వరకు నాటిన మొక్కలు ఇప్పుడు ఎంతో నీడనిస్తున్నాయి. ఇవే కాకుండా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వం తరఫున మొక్కలు నాటా. ప్రశ్న: ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారంలో ఏ రకం మొక్కలు నాటితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది? రామయ్య: ప్రస్తుతం ప్రభుత్వం హరితహారంలో నాటుతున్న మొక్కలు నీడనిచ్చేవిగానే ఉన్నా యి. వీటితోపాటు ఇంకా పండ్ల మొక్కలు నాటి తే అవి నీడతోపాటు ఫలాలు కూడా ఇస్తాయి. 20చెట్ల చొప్పున కొంతమంది కూలీలకు అంది స్తే.. అవి వారు పెంచి పెద్దచేసి వాటి ఫలాలను అనుభవిస్తూ ఉపాధి కూడా పొందుతారు. అదే విధంగా రోడ్ల వెంబడి నాటిన మొక్కలను రోడ్డు వెడల్పు చేసే పేరుతో తొలగిస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరదు. ప్రశ్న: చివరగా మొక్కల పెంపకంపై మీరిచ్చే సందేశం? రామయ్య: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. నాటిన ఆ మొక్కలను సంరక్షించాలి. ఇళ్లు, చేలల్లో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ మొక్క నాటాలి. అప్పడే భావితరాల భవిష్యత్‌ను కాపాడిన వారమవుతాం. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మొక్కల ప్రా«ధాన్యం తెలిపేందుకు కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ పక్కనే చెట్లు ముద్రిస్తే మొక్కల పెంపకంపై ప్రపంచమంతా నయా పైసా ఖర్చు లేకుండా మొక్కల పెంపకం గురించి ప్రచారం లభిస్తుంది. మనందరం చాలెంజ్‌గా తీసుకుని మొక్కలు ఎక్కువ మొత్తంలో నాటాలి. -
వనజీవి రామయ్యకు సన్మానం
సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు ప్రచారం నిర్వహిస్తూ ఇప్పటికే కోటికిపైగా మొక్కలు నాటి వనజీవిగా పేరుపొందిన రామయ్యను ఆదివారం జిల్లా కేంద్రంలోని జెజెనగర్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సన్మానించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు పేటలో పలువురు ఘనస్వాగతం పలికి ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వనజీవి రామయ్య స్ఫూర్తితో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలోరైతు సమన్వయ సమితి రాష్ట్ర డైరెక్టర్ గుడిపూడి వెంకటేశ్వర్రావు, సందీప్ పాల్గొన్నారు. -
ప్రధాని మోదీని కలసిన వనజీవి రామయ్య
ఖమ్మంరూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన ఎట్‌హోం, రిపబ్లిక్ వేడుకల్లో ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన రామయ్య ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను కలుసుకున్నారు. -
‘స్వచ్ఛతే సేవ’ లో వనజీవి
సాక్షి, ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వనజీవి రామయ్య 'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 23 నుండి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పర్యావరణం, స్వచ్ఛ భారత్ కోసం ఆయన ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించడానికి శనివారం ఉదయం స్వగ్రామం ముత్తుగూడెం నుంచి బయలుదేరి వెళ్లారు. కాగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వనజీవి రామయ్యకు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. ఈ సందర్భంగా కోటి మొక్కల రామయ్య సేవలను మోదీ ప్రశంసించారు. ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
వనజీవి రామయ్యకు చంద్రబాబు పరామర్శ
ఖమ్మం రూరల్: పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్యను ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్లో సోమవారం పరామర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలసి ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు.. రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రామయ్యకు ఓ మొక్కను అందించారు. కాగా.. చంద్రబాబు తనకు రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించినట్లు రామయ్య తెలిపారు.