‘స్వచ్ఛతే సేవ’ లో వనజీవి | vanjeevi ramaiah in Swachhate Seva programme | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛతే సేవ’ లో వనజీవి

Published Sat, Sep 23 2017 11:56 AM | Last Updated on Sat, Sep 23 2017 11:56 AM

vanjeevi ramaiah in Swachhate Seva programme

సాక్షి, ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వనజీవి రామయ్య 'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 23 నుండి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పర్యావరణం, స్వచ్ఛ భారత్ కోసం ఆయన ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించడానికి శనివారం ఉదయం స్వగ్రామం ముత్తుగూడెం నుంచి బయలుదేరి వెళ్లారు.

కాగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా  వనజీవి  రామయ్యకు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. ఈ సందర్భంగా కోటి మొక్కల రామయ్య సేవలను మోదీ ప్రశంసించారు. ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement