
రామయ్య దంపతులను సన్మానిస్తున్న ఎంపీ
సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు ప్రచారం నిర్వహిస్తూ ఇప్పటికే కోటికిపైగా మొక్కలు నాటి వనజీవిగా పేరుపొందిన రామయ్యను ఆదివారం జిల్లా కేంద్రంలోని జెజెనగర్‌లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సన్మానించారు.
తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు పేటలో పలువురు ఘనస్వాగతం పలికి ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వనజీవి రామయ్య స్ఫూర్తితో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలోరైతు సమన్వయ సమితి రాష్ట్ర డైరెక్టర్ గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment