వనజీవి రామయ్యకు చంద్రబాబు పరామర్శ
ఖమ్మం రూరల్: పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్యను ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో సోమవారం పరామర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలసి ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు.. రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రామయ్యకు ఓ మొక్కను అందించారు. కాగా.. చంద్రబాబు తనకు రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించినట్లు రామయ్య తెలిపారు.