సాక్షి, ఖమ్మం: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రామయ్యను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యా కాలు, చేతి, తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వనజీవి రామయ్యను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల కాలంలో రామయ్యకి జరిగిన రెండో రోడ్డు ప్రమాదం ఇది. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ నేపథ్యంలో రామయ్యకు కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు.
వనజీవి రామయ్యను ఆదుకుంటాం: మంత్రి హరీష్ రావు
వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వనజీవి రామయ్య ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని తక్షణమే మంత్రి స్పందించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. రామయ్యకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
చదవండి: Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
Comments
Please login to add a commentAdd a comment