ఆ వార్తలను ఖండించిన రెబల్‌ స్టార్‌ | Krishnam Raju Condemns About His Health Conditions | Sakshi
Sakshi News home page

ఆ వార్తలను ఖండించిన రెబల్‌ స్టార్‌

Published Thu, Nov 14 2019 7:51 PM | Last Updated on Thu, Nov 14 2019 7:55 PM

Krishnam Raju Condemns About His Health Conditions - Sakshi

కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు అస్వస్థకు గురయ్యారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై కృష్ణంరాజు ఖండించారు. కేవలం న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్ళానని, కానీ కొన్ని పత్రికలు మాత్రం నిర్ధారణ లేకుండా వార్తలు ప్రచురణ చేశాయని కృష్ణంరాజు అన్నారు. దీనివల్ల ఆస్పత్రిల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా అభిమానులు చాలా కంగారు పడడంతో సమాధానం చెప్పడం కష్టమైందని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని, చెకప్స్‌ పూర‍్తయిన వెంటనే ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని కృష్ణం రాజు అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement