Sarath Babu Is Alive And Recovering; Kamal Haasan Deletes Condolence Tweet - Sakshi
Sakshi News home page

Sarath Babu-Kamal Haasan: శరత్‌బాబుకు సంతాపం తెలిపిన కమల్‌హాసన్‌.. కాసేపటికే ట్వీట్‌ డిలీట్‌

Published Thu, May 4 2023 12:42 PM | Last Updated on Thu, May 4 2023 1:00 PM

Kamal Haasan Deletes His Condolence Tweet On Sarath Babu - Sakshi

సీనియర్‌ నటుడు శరత్‌బాబు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మరణించారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శరత్‌బాబు కన్నుమూశారంటూ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శరత్‌బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ

శరత్‌బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్‌బాబు చనిపోయాడంటూ వార్తలు బాగా వైరల్‌ కావడంతో పలువురు ఆయనకు సంతాపం కూడా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కూడా ఇలాగే తప్పులో కాలేశారు. శరత్‌బాబుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్‌ చేశారు.

'నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్‌బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం'.. అంటూ ట్వీట్‌ చేసి కాసేపటికే డిలీట్‌ చేశారు. అయితే అప్పటికే కమల్‌ చేసిన ఆ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: హీరోయిన్‌ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement