
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్‌కు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
హాస్యపాత్రలతో తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్ అనారోగ్యంపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తనకు ఎటువంటి అనారోగ్యం లేదని గతంలో ఆయన వివరణయిచ్చారు. రాజకీయాల్లో రాణించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పట్లో నామినేషన్ కూడా వేశారు.