రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై పాశ్చాత్య దేశాలు, రష్యా నిఘా మీడియాలు చేస్తున్న హడావిడి ఏమాత్రం తగ్గట్లేదు. క్రెమ్లిన్ నేత పరిస్థితిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. తరచూ ఏదో ఒక కథనం బయటకు వస్తూనే ఉంది. ఈ తరుణంలో పుతిన్ టైం దగ్గర పడిందంటూ తాజాగా ఓ సంచలన కథనం వెలువడింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పరిస్థితి క్యాన్సర్‌తో క్షీణిస్తున్నట్లు తాజా కథనం వెలువడింది. ఎఫ్‌ఎస్‌బీ (Federal Security Service) అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ పుతిన్ ఆరోగ్యంపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసినట్లు ఆ కథనం ఉంది. క్యాన్సర్ బాధితుడైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహా అయితే మరో మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు తెలిపినట్లు ఆయన ప్రకటన ఉంది.
పుతిన్ ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. రెండు నుంచి మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు అంటున్నారు. పుతిన్ క్రమంగా కంటిచూపు కూడా కోల్పోతున్నారని, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నట్లు బోరిస్ వెల్లడించినట్లు ఆ కథనం ఉంది. పుతిన్ ప్రసంగాల టైంలో అక్షరాలను చాలా పెద్దదిగా రాసి ఇస్తున్నారని చెప్పారాయన. కళ్లద్దాలు ధరించేందుకు పుతిన్ ససేమిరా అంటున్నారని, దృష్టిలోపం ఉన్నట్లు అంగీకరించడం పుతిన్‌కు ఇష్టం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. పుతిన్ కాళ్లుచేతులు వణకడం సమస్య పెరిగిపోయిందని తెలిపారు.
తన కింద పనిచేసే సిబ్బందిపై చీటికీమాటికీ కోపగించుకుంటున్నారని, విపరీతమైన చిరాకుతో సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సదరు నిఘా అధికారి చెప్పారు. ఇక యూకే ఇంటెలిజెంట్ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ కూడా పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని తెలిపాడు. సమావేశాలను పూర్తి చేయకుండానే పుతిన్ మధ్యలో వెళ్లిపోతున్నాడని, ఆయన పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అనడానికి ఇదే నిదర్శనమని క్రిస్టోఫర్ చెబుతున్నాడు.
కళ్లు మూసుకున్నారేమో!
ఇదిలా ఉంటే.. పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటివరకు రష్యా స్పందించలేదు. కానీ, మరీ తారాస్థాయికి ప్రచారం చేరడంతో ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఘాటుగా స్పందించారు. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలు అంతా ఉత్త ప్రచారమే అని కొట్టిపారేశారు ఆయన. ‘‘ఆయన(పుతిన్) సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపాడు. విచక్షణ ఉన్నవాడేవడూ.. ఇలా ప్రవర్తించడు, ఉత్త ప్రచారాలు చేయడు అంటూ పుతిన్ అనారోగ్య కథనాలపై సెటైర్లు వేశాడు లావ్‌రోవ్.
ఈ అక్టోబర్‌కు పుతిన్‌కు 70 ఏళ్లు నిండుతాయి. అయినా రోజూ ఆయన వార్తల్లో కనిపిస్తున్నారు కదా. నిత్యం టీవీల్లోనూ ప్రసంగిస్తున్నారు. కొందరికి కళ్లు మూసుకుపోయినట్లు ఉన్నాయి. అయినా పుకార్లను పంచడం వాళ్లకేం(పాశ్చాత్య మీడియాను ఉద్దేశించి) కొత్త కాదు కదా అంటూ పుతిన్ ఆరోగ్యంపై ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు సెర్గీ లావ్‌రోవ్.
Comments
Please login to add a commentAdd a comment