
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వైద్యులు ఈటలకు చికిత్స అందిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ అస్వస్థకు గురైన విషయం తెలిసిందే.
ఈటల రాజేందర్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయనకు ఆక్సిజన్, బీపీ స్థాయిలు పడిపోయినట్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్ తరలించారు. ఈటల అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment