సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. 5 ఎకరాల పొలం పట్టా | YS Jagan Government Fulfilled Promise To Sugali Preethi Family Kurnool | Sakshi
Sakshi News home page

సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. 5 ఎకరాల పొలం పట్టా, 5 సెంట్ల ఇంటి స్థలం

Published Sat, Nov 13 2021 5:21 PM | Last Updated on Sat, Nov 13 2021 5:53 PM

YS Jagan Government Fulfilled Promise To Sugali Preethi Family Kurnool - Sakshi

ప్రీతిబాయి తల్లిదండ్రులకు పట్టాలను అందజేస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు 

కర్నూలు (సెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటికే ప్రీతిబాయి తండ్రి రాజునాయక్‌కు రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాజునాయక్, పార్వతిదేవికి కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం స్థలం, దిన్నెదేవరపాడులో 5 ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాలను అందజేశారు.

దీంతో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వానికి ప్రీతిబాయి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.  శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ తమీన్‌ అన్సారియా, డీఆర్‌వో పుల్లయ్య పాల్గొన్నారు.
(చదవండి: న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement