సాక్షి, ఖమ్మం: వరంగల్ ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసు తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు.
అయితే, సైఫ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో, సైఫ్ గురువారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యాడు. ఇదిలా ఉండగా.. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు కోర్టు విధించింది. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment