SAIF
-
ప్రీతి కేసు.. సైఫ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత!
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి(26) సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ పై సస్పెన్సన్‌ను ఎత్తేశారు. హైకోర్టు ఆదేశంతో సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ ప్రకటించారు. దీంతో.. తరగతులకు హాజరు అయ్యేందుకు సైఫ్‌కు అనుమతి లభించినట్లయ్యింది. డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే.. ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 22 న ఎంజీఎంలో ఆమె ఆత్మహత్యా యత్నం చేయగా.. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ 26వ తేదీన కన్నుమూసింది. మరోవైపు ప్రీతి మృతికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ఆమె పేరెంట్స్.. పోలీసులకు, కళాశాల ప్రిన్సిపల్ కు పిర్యాదు చేశారు. ర్యాగింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద కేసు నమోదు చేసి సైఫ్ ను రిమాండ్ తరలించిన పోలీసులు. మరోవైపు కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ కేసు తీవ్రంగా పరిగణించింది. ఏడాదిపాటు సైఫ్ తరగతులకు హాజరు కాకుండా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో.. బెయిల్‌పై సైఫ్ ఈ విడుదల అయ్యాడు కూడా. అయితే.. తన నుంచి వివరణ తీసుకోకుండానే కాలేజీ తనపై సస్పెన్షన్ వేటు వేసిందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు సైఫ్. ఈ క్రమంలోనే.. సైఫ్ వివరణ తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. అయితే.. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని గత శుక్రవారం సైఫ్ కు నోటీస్ ఇచ్చారు కేఎంసీ ప్రిన్సిపాల్. కానీ, ఆ సమావేశానికి సైఫ్ హాజరు కాలేదు. దీంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపాల్. అయితే.. ప్రస్తుతానికి సస్పెన్షన్ ను తాత్కాలికంగా నిలిపివేసి సైఫ్‌ను తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత అతని వివరణ తీసుకోవాలని.. ఆపై యాంటీ ర్యాగింగ్ కమిటీదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఆదేశాల మేరకు సైఫ్ సస్పెన్సన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కేఎంసీ ప్రిన్సిపాల్. -
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే ప్రధాన కారణం : సీపీ రంగనాథ్
-
ప్రీతి మృతి కేసు.. ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదల
సాక్షి, ఖమ్మం: వరంగల్ ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసు తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, సైఫ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో, సైఫ్ గురువారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యాడు. ఇదిలా ఉండగా.. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు కోర్టు విధించింది. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు. -
మెడికో ప్రీతి మృతిపై వీడని మిస్టరీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి మిస్టరీగానే మిగిలింది. రెండు నెలలు కావస్తున్న ప్రీతి డెత్ ఆత్మహత్యనా.. హత్యనా తేలక అనుమానస్పద మృతిగానే పోలీసులు పరిగణిస్తున్నారు. ప్రీతి ఏలా చనిపోయిందో స్పష్టమైన ఆధారాలు లభించకపోయినప్పటికి ర్యాగింగే ప్రీతి డెత్‌కు కారణమని పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందుకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్ధి సైఫ్‌ను అరెస్టు చేసి జైల్ కు పంపగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరయ్యింది. ఈ ఏడాది పిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయింది. నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ప్రీతి ప్రాణాలు కోల్పోయారు. ప్రీతి మృతిపై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు ర్యాగింగే కారణమని తేల్చారు. ముందుగా ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి మత్తు రసాయనాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఎవరైనా హత్య చేశారా అంటే అందుకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. హత్య కాదు... ఆత్మహత్య చేసుకోలేదు.. మరి ప్రీతి ఎలా చనిపోయిందనేది అందరి మదిని తోలుస్తున్న ప్రశ్న. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా బావిస్తూ అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా సాగిస్తున్న విచారణలో ఏమి తేలలేదు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసులో కీలకంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స విబాగంలో ప్రీతి పడిపోయిన విశ్రాంతి గది సీజ్‌ను తొలగించారు. ఘటన జరిగిన రోజున మట్టెవాడ పోలీసులు ఈ గదిని సీజ్ చేసి పలుమార్లు సిపి రంగనాథ్ సందర్శించి స్వయంగా విచారణ చేశారు. ఇప్పటి వరకు కేసులో ఏలాంటి పురోగతి కనిపించకపోగా, మట్టెవాడ పోలీసులు సీజ్ చేసిన గది తాళాలను తొలగించి ఎంజీఎం అధికారులకు అప్పగించారు. ఈ కేసును పోలీసులు ఎటు తేల్చకుండానే గది తాళాలను ఎంజీఎం అధికారులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రీతి డెత్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా క్రమంగా కేసు తీవ్రతను తగ్గిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రీతి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగాలేదని, ఇప్పటివరకు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా కేఎంసీ ప్రిన్సిపల్ హెచ్ఓడీపై చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ లో రూమ్ ఎందుకు సీజ్ తొలగించారని ప్రీతి సోదరుడు పృథ్వి ప్రశ్నిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని, అదే నిజమైతే ఎందుకు రక్తం ఎక్కించారు.. కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన గది సీజ్‌ను తొలగించడానికి కారణం పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బందికి అత్యవసర చికిత్స కోసం అవసరం కావడంతోనే సీజ్ తొలగించి ఆసుపత్రికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఏ ఒక్క చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సిపి రంగనాథ్ తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్తగా లోతైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఫైనల్‌గా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ నిర్ణయానికి రాలేమన్నారు సిపి రంగనాథ్. ఒకవేళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినా, సాధారణ మరణమే అయినా అందుకు ర్యాగింగే కారణమని స్పష్టం చేశారు. సైఫ్, ప్రీతి సెల్ ఫోన్ మెసేజ్‌లు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌ల ఆధారంగా ప్రీతి ర్యాగింగ్‌కు గురైందని నిర్ధారించామని, ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం సైఫ్ కు పదేళ్ళ శిక్షతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్ష అదనంగా ఉండే అవకాశం ఉందని ఇటీవల సీపి ప్రకటించారు. మరోవైపు సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా.. మూడుసార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ లభించింది. పది వేల బాండ్, ఇద్దరు పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ ఇచ్చి, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఇక దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇంకా పోస్ట్ మార్టమ్ రిపోర్టు రాకపోవడం, కేసు మిస్టరీ వీడకపోవడంతో కన్నవారు మానసిక ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తన కూతురు ఎలా చనిపోయిందో స్పష్టం చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రీతి హత్య కేసు.. సైఫ్‌కి బెయిల్ మంజూరు
సాక్షి, వరంగల్: కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి హత్య కేసులో నిందితుడు సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌కి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సత్యేంద్ర షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 60 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ బుధవారం నాటికి 58 రోజులు అవుతున్న సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు విన్పించారు. వాదనల అనంతరం కోర్టు సైఫ్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే చార్జి షీట్ దాఖలు చేసేనాటికి లేదా 16 వారాల వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధిత విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని షరతు విధించింది. వ్యక్తిగతంగా రూ.10 వేల బాండ్, ఇద్దరు జమానత్దారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాక్షులపై కానీ, మృతురాలి కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ప్రాసిక్యూషన్ వారికి బెయిల్ రద్దు కోరే అవకాశం ఇస్తూ కోర్టు ఆదేశించింది. చదవండి: లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పి.. -
కేటీఆర్‌ను కలిసిన ప్రీతి కుటుంబసభ్యులు
సాక్షి, మహబూబాబాద్/ వరంగల్ లీగల్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి ని ప్రీతి కుటుంబసభ్యులు మహబూబాబా ద్ జిల్లా తొర్రూరులో బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ప్రీతి స్వగ్రామం పాలకుర్తి నియోజకవ ర్గంలోని గిరిజన తండా. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు.. ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, శారద తదితరులను ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అంతకు ముందు ప్రీతి చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సైఫ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర బుధవారం తిరస్కరించారు. నిందితుడు సైఫ్‌ను పోలీస్ కస్టడీ కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. రెండు గంటలకుపైగా సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం ఉభయుల పిటిషన్లను తిరస్కరిస్తూ జడ్జి సత్యేంద్ర ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నేరుగా కోర్టుకు విన్నవించే అవకాశంతో ప్రీతి తండ్రి నరేందర్.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం.సత్యనాయణగౌడ్‌ను కలిశారు. కేసు పురోగతి, తన సందేహాలపై ఆయనతో చర్చించారు. -
ప్రీతిది ముమ్మాటికీ హత్యే
కొడకండ్ల: పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై కుటుంబసభ్యులతోపాటు తమ పార్టీ ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిరి్నతండాలో ప్రీతి కుటుంబసభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తప్పులేకపోతే ప్రీతి ఘటనపై ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కాపాడేందుకే ప్రభుత్వం డ్రామాలాడుతోందని, కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రీతి మతికి కారకులైన వారికి కఠినశిక్ష పడే వరకు ఆమె కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గిరిజన కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, కుటుంబసభ్యులను బెదిరించి మృతదేహాన్ని ఎత్తుకెళ్లే నీచానికి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని దుయ్యబట్టారు. నేడు నిరసన దీక్ష.. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు దీక్ష చేపడతానని బండి సంజయ్ వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్ పాల్గొన్నారు. సంజయ్‌ను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి బండి కాన్వాయ్‌ను పంపించారు. కాగా, ప్రీతి మృతికి సంతాపంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కొవ్వొతుల ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ సాక్షి, హైదరాబాద్: వెంటనే వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జూలై 1 నుంచి పెంచిన జీతాలు చెల్లించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. అలాగే బీఆర్ఎస్ ఎన్నికల హామీలైన రుణమాఫీ, ఉచిత యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూపంపిణీ వంటి వాటì అమలుకు రానున్న కేబినెట్ భేటీలో నిధులు కేటాయించాలన్నారు. -
ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య అంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే మిస్టరీని ఛేదించాల్సి ఉంది. ఆ సమయంలోనే ప్రీతి కుప్పకూలి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పుడు అక్కడ ఎవరెవరున్నారనేది పోలీసుల విచారణలో తేలినా సాంకేతిక దర్యాప్తులోనూ అనుమానమున్న వ్యక్తులు అక్కడేమైనా ఉన్నారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 24న నిందితుడైన సెకండియర్ విద్యార్థి సైఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సమయంలో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాలు ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... ♦ గత డిసెంబర్లో ఓ ప్రమాద కేసులో రోగి గైడ్ వైర్ విషయంలో సైఫ్ ప్రీతిని వేధించాడు. ఫిబ్రవరిలో హనుమకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్నప్పుడూ ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్స్ (పీఏసీ) రాయమన్నాడు. దాన్ని ప్రీతి రాశాక, వాట్సాప్ గ్రూప్‌లో ఆ నివేదికను పోస్టు చేసి ఇది ఎవరు రాశారంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి ప్రీతి స్పందిస్తూ ‘నాతో ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీ లేదంటే జీఎంహెచ్ ఇన్చార్జికి ఫిర్యాదు చేయ్’ అని సైఫ్‌కు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. లేదంటే ఇదే విషయాన్ని హెచ్ఓడీకి చెబుతాననడంతో కోపోద్రిక్తుడైన సైఫ్ ఆమెను మరింత వేధించాలనుకున్నాడు. ♦ హెచ్ఓడీకి సైఫ్‌పై ఫిర్యాదు చేసేందుకు మద్దతివ్వాలని స్నేహితులు, సహచరులను ప్రీతి కోరింది. తన ప్రవర్తన మారకపోతే అందరినీ వేధిస్తాడని చెప్పింది. ♦ ఈ నెల 21న అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకు వేధింపులపై వచ్చిన సమాచారంతో అదేరోజు 11 గంటలకు సైఫ్‌ను పిలిపించి మాట్లాడారు. ప్రీతిని ఎందుకు వేధిస్తున్నావు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రీతిని పిలిచి ఇద్దరూ ఒకేచోట డ్యూటీ చేయొద్దన్నారు. ఎంజీఎం కాకుండా అంతకుముందు డ్యూటీ వేసిన ఆస్పత్రిలోనూ చేసుకోవచ్చన్నారు. ♦ ప్రీతి అదేరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీఎంలో వి ధులకు హాజరైంది. స్టాఫ్ నర్సు మండె విజయలక్ష్మి, సె కండియర్ స్టూడెంట్ డాక్టర్ భీమని మనీశ్, థర్డ్ ఇయర్ హౌస్ సర్జన్ డాక్టర్ రూహితో కలిసి విధులు నిర్వర్తించింది. 22న ఉదయం 5 నుంచి 7 గంటల వరకు జరిగిన అపరేషన్‌లో పాల్గొంది. ఆ తర్వాత అనస్తీషి యా పీజీ రూమ్ లోకి వెళ్లింది. 7.15 నిమిషాలకు స్టాఫ్ నర్సు విజయలక్ష్మి అక్కడికెళ్లగా కిందపడి ఉన్న ప్రీతిని చూసింది. ప్రీతికి డాక్టర్ రూహి, డాక్టర్ భీమని మనీశ్ చికిత్స అందించారు. తేలాల్సినవెన్నో... ♦ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి క్లాస్‌మెట్స్, సీనియర్ విద్యార్థులకు తెలిసినా ఆమె సహాయం కోరినప్పుడు వారు ఎందుకు మద్దతివ్వలేదు. ప్రీతి క్లాస్మేట్ అనూషకు వాట్సాప్ ద్వారా ప్రీతికి సపోర్ట్ చేయొద్దంటూ సైఫ్ వ్యక్తిగతంగా పెట్టిన మెసేజ్ పోలీసులకు లభ్యమైంది. ప్రీతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ ఈ వైద్య విద్యారి్థనులంతా సైఫ్‌కు అనుకూలంగా ఆందోళన చేయడం వివాదాస్పదమైంది. విద్యార్థులు సీనియర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని వెనకడుగు వేశారా అన్నది తేలాలి. ♦ ప్రీతి కార్డియాక్ అరెస్ట్ వల్ల కుప్పకూలిందని, పీఏసీ రిపోర్టు విషయంలోనే సైఫ్ గట్టిగా మాట్లాడాడని, వేధింపులు, ర్యాగింగ్ లేవని బుధవారం నాడే ఎంజీఎం, కేఎంసీ ఉన్నతాధికారులు ఎందుకు ప్రకటించారు? సైఫ్ ర్యాగింగ్, వేధింపులు చేశాడని కౌన్సెలింగ్‌లో ఒప్పుకున్నా ఈ మాటల్ని వీరెందుకు చెప్పలేదు? ♦ ట్యాక్సికాలాజి రిపోర్టు వెల్లడించినా ఆమె ఇంజక్షన్ తీసుకుందా అన్నది పోలీసులు తేల్చాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు
-
ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ ఫోన్లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవ్, ఎల్డీడీ+నాక్ అవుట్స్(LDD+knockout) గ్రూప్ చాట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగంలో ప్రీతి సుపర్ వైజర్‌గా సైఫ్ ఉండేవాడని.. రెండు ఘటనల ఆధారంగా ఆమెపై కోపం పెంచుకున్నట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డిసెంబర్లో ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేసినట్లు తెలిసింది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా.. ఆమె రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేశాడు. రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించాడు. తనతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే హెచ్ఓడీకి చెప్పాలని ప్రీతి.. సైఫ్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రీతిని వేధించాలని సైఫ్.. భార్గవ్‌కు చెప్పాడు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. దీంతో గత నెల 21న హెచ్ఓడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలోప్రీతి సైఫ్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది’ అని సైఫ్ రిమాండ్ రిపోర్టులో తేలింది. కాగా, సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. మరోవైపు నిందితుడు మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. -
సైఫ్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
-
పేటీఎంలోకి ఆలీబాబా మరో రూ.1,200 కోట్లు!
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ సంస్థలో చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా, మరో ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఎస్ఏఐఎఫ్ (సెయిఫ్) పార్ట్నర్స్ దాదాపు 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,350 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ సంస్థ 177 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,200 కోట్లు), మిగతా మొత్తం సెయిఫ్ పెట్టుబడి పెట్టనున్నాయి. తాజా పెట్టుబడుల అనంతరం పేటీఎం ఈ–కామర్స్‌లో ఆలీబాబా సింగపూర్ ఈ–కామర్స్ వాటాలు 36.31 శాతంగాను, సెయిఫ్ పార్ట్నర్స్ వాటా 4.66 శాతంగాను ఉండనున్నాయి. ఈ డీల్‌తో పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 1 బిలియన్ డాలర్లకు చేరనుంది. గతంలో 60 మిలియన్ డాలర్లు సమీకరించినప్పుడు పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ వేల్యుయేషన్ 4.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వన్ 97 కమ్యూనికేషన్స్‌కి ప్రస్తుతం పేటీఎం ఈ–కామర్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం మొబైల్ సొల్యూషన్స్ అనే మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. దేశీ సంస్థ ఫ్లిప్‌కార్ట్, అమెరికన్ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆధిపత్యం చెలాయిస్తున్న దేశీ ఈ–కామర్స్ మార్కెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రస్తుత డీల్ ఆలీబాబాకు ఉపయోగపడనుంది. దూకుడుగా దూసుకెళుతున్న అమెజాన్ తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంటోంది. మరోవైపు, నిధుల కొరతతో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆలీబాబా రాక.. దేశీ ఆన్లైన్ రిటైల్ పరిశ్రమ ఓ కుదుపు కుదపగలదని పరిశీలకుల అంచనా. 2015లో 11 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ 2016 చివరికి 14–16 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం నాటికి 69 బిలియన్ డాలర్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా. -
పనామా జాబితాలో బాలీవుడ్ తారలు
సైఫ్, కరీనాలతో పాటు కరిష్మా కపూర్ కూడా * పత్రాల్లో వీడియోకాన్ వేణుగోపాల్ ధూత్ పేరు * మరో సీఏ, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురుకూ విదేశీ కంపెనీలు * తాజా జాబితాలో కొందరు మధ్యతరగతి వ్యాపారులు న్యూఢిల్లీ: పనామా పేపర్స్ తాజా జాబితాలో మరో ముగ్గురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్, కరిష్మా కపూర్‌తోపాటు వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్‌లు విదేశీ కంపెనీలతో జతకట్టినట్లు తెలిసింది. ముంబైలోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ఓ టైర్ల కంపెనీ ఓనర్, వస్త్ర దుకాణ యజమాని, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురు, వస్త్ర ఎగుమతి దారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమానితోపాటు పలువురు పారిశ్రామికవేత్తల పేర్లు గురువారం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. సైఫ్, కరీనా, కరిష్మా, వేణుగోపాల్ ధూత్ 2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు పుణెలోని ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ చోర్డియా గ్రూపు, వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ అవధూతతోపాటు పలువురు బాలీవుడ్ నటులు ఓ కన్సార్షియం (పీ-విజన్ స్పోర్ట్స్)గా ఏర్పడ్డారు. ఈ కన్సార్షియంలో సైఫ్‌కు 9 శాతం, కరీనా, కరిష్మాలకు చెరో 4.5శాతం వాటాలుండగా.. ధూత్‌కు 25 శాతం, చోర్డియా కుటుంబానికి 33 శాతంతోపాటు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన అబ్డ్యురేట్ లిమిటెడ్ కంపెనీకి 15 శాతం వాటా ఉందని తేలింది. వేలంలో పుణె ఫ్రాంచైజీ దక్కకపోవటంతో.. ‘పీ-విజన్ స్పోర్ట్స్’ కంపెనీని వెంటనే మూసేశారని పేపర్స్‌లో వెల్లడైంది. అయితే.. ఈ కన్సార్షియంలో 25 శాతం వాటా తీసుకున్న మాట వాస్తవమేనని అయితే.. అబ్డ్యురేట్ లిమిటెడ్ సంగతి తనకు తెలియదని ధూత్ వ్లెడించారు. ఫొన్సెకాతో ‘కోనేరు’ ఉత్తరప్రత్యుత్తరాలు పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకాతో ట్రైమెక్స్ గ్రూపునకు చెందిన తెలుగు వ్యాపారవేత్త కోనేరు మధు (దుబాయ్ కేంద్రంగా పలు కంపెనీలు నడుపుతున్నారు) ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు తాజా పత్రాల్లో వెల్లడయింది. ఈ కంపెనీ సహకారంతో బీవీఐలో 12 కంపెనీలను కోనేరు రిజిస్టర్ చేశారు. కాగా, 2012లో హైదరాబాద్‌లో దాఖలైన ఎమ్మార్ కేసుకు సంబంధించిన (కేసు నమోదు, బెయిల్ వంటి) వివరాలను కూడా ఫోన్సెకా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు మధు వెల్లడించినట్లు ఈ లేఖల్లో ఉంది. దీనిపై మధు తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మధు నిబంధనలను పాటించే వ్యక్తి. ఆయన చట్టబద్ధంగానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు’ అని పేర్కొన్నారు. లోకేశ్ శర్మ, టీసీఎం గ్రూపు తాజా జాబితాలో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ట్వంటీఫస్ట్ సెంచరీ మీడియా (టీసీఎం) గ్రూపు చైర్మన్ లోకేశ్ శర్మ పేరు కూడా ఉంది. లోకేశ్‌కు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో మూడు కంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. అయితే డీడీసీఏ వివాదంలో జైట్లీతోపాటు టీసీఎం యజమాని లోకేశ్‌పైనా ఆప్ విమర్శలు చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన ఉదయ్ ప్రతాప్ సింగ్‌కు బీవీఐలో స్టీల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాలున్నట్లు వెల్లడైంది. ఢిల్లీ వ్యాపారి అలోక్ భాటియా, ఆయన భార్య సిల్వియా భాటియాలకు రెండు కంపెనీలున్నాయి. ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురైన సిల్వియా.. ఈ కంపెనీల్లో వచ్చిన లాభాలను కోల్ పీటీవై లిమిటెడ్ (ఆస్ట్రేలియా)కు బదిలీ చేసినట్లు వెల్లడైంది. పురుషుల ఫ్యాషన్ దిగ్గజం జేఎం కంపెనీ యజమాని జానీ మంగ్లానీకి బీవీఐతోపాటు సిప్రస్లోనూ పలుకంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అయితే.. దీనిపై మంగ్లానీ స్పందిస్తూ.. ‘నేను సింగపూర్‌లో ఉంటున్నాను. నాకు ఏ కంపనీల గురించీ తెలియదు. నా వ్యాపారం (వస్త్ర) నేను చేసుకుంటున్నాను. సింగపూరియన్లను వదిలిపెట్టి అవినీతికి పాల్పడుతున్న భారతీయులు, అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్న వారిపై గురిపెట్టండి’ అనిసూచించారు. ఆన్లైన్ రిటైలర్ మింత్రా.కామ్ మాజీ వైస్‌ప్రెసిడెంట్ నిష్ భుటానీకీ బీవీఐలో ఆర్ట్స్ అలయెన్స్ మీడియా లిమిటెడ్ కంపెనీలో వాటాలున్నాయి. ఢిల్లీ వ్యాపారవేత్త వినయ్ కృష్ణన్ చౌదరీకి బీవీఐ కేంద్రంగా పనిచేసే రెండు కంపెనీల్లో భాగస్వామ్యం ఉండగా. ముంబైకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దిలీప్ జయంతీలాల్ ఠక్కర్‌కు బహమాస్‌లో కన్సు కార్పొరేషన్ కంపెనీ ఉందని వెల్లడైంది. ఫొన్సెకా కంపెనీల్లో మూడోవంతు చైనావే మొసాక్ ఫొన్సెకా వ్యాపారంలో మూడోవంతు చైనా కంపెనీలేనని ఇంటర్నేషనల్ ఐసీఐజే వెల్లడించింది. ఎంఎఫ్ సలహాతో నడుస్తున్న వాటిలో 16,300 కంపెనీలు చైనా, హాంకాంగ్ దేశస్తులవేనని తెలిపింది. మరోవైపు, బ్యాంకులు షెల్ కంపెనీల యజమానులను సులభంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. వీటి ద్వారా బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను గుర్తించి.. జాగ్రత్తపడొచ్చని భావిస్తోంది. మరోవైపు, పనామా పేపర్స్ వివాదంలో యూఈఎఫ్ఏ కార్యాలయాల్లో సిట్జర్లాండ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ‘పనామా’పై న్యాయ విచారణకు డిమాండ్ పనామా పేపర్స్ వివాదంలో వెల్లడవుతున్న భారతీయుల పేర్లపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్, ఆప్ డిమాండ్ చేశాయి. అయితే.. విదేశాల్లో అక్రమంగా కంపెనీలున్న వారు ఇకపై నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనని అరుణ్‌జైట్లీ అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు, బీజేపీ ఎంపీ అభిషేక్ సింగ్‌కూ విదేశీ కంపెనీల్లో వాటాలున్నాయని.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. వీటిని అభిషేక్ ఖండించారు. పనామా జాబితాలో వెల్లడైన 500 మంది భారతీయుల ఆస్తులు దర్యాప్తు చేసేందుకు కేంద్రం వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటుచేసిన దర్యాప్తు బృందం గురువారం ఢిల్లీలో సమావేశమైంది. సామాన్యులకూ కంపెనీలు చెన్నైలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన షణ్ముగ సుందరపాండియన్కు పనాసియా స్టార్ లిమిటెడ్, విర్ ఫ్యాషన్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలున్నట్లు తేలింది. సుందరపాండియన్ సోదరుడు చెన్నైలో జర్నలిస్టుగా ఉన్నారు. కేరళలోని కొబ్బరికాయల చిరు వ్యాపారైన దినేశ్ పరమేశ్వరన్ నాయర్‌కు ఓ విదేశీ కంపెనీలో భాగస్వామ్యం ఉందని తేలింది.