
మణికొండ: తనను మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ప్రీతి అనే మహిళ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. లావణ్య తనను ఫోన్ చేసి వేధిస్తోందని, తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి శుక్రవారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయమై నార్సింగి అడ్మిన్ ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డిని వివరణ కోరగా ప్రీతి అనే మహిళ ఇచి్చన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, అది తమ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంతోపాటు..అందులోని ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై ఇపుడే ఏమి చెప్పలేమన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ ఫిర్యాదుపై వివరాలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదుదారు ప్రీతితో పాటు ఆర్‌జే శేఖర్ బాష, న్యాయవాది శర్మ ఉన్నారు.

Comments
Please login to add a commentAdd a comment