తన కుమార్తె మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవిస్తున్న ప్రీతి తల్లి పార్వతి
సాక్షి, కర్నూలు, అమరావతి : కర్నూలులో 2017లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిఫర్ చేయనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ప్రీతి కుటుంబ సభ్యులకు వెల్లడించారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలులో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన్ను కలుసుకున్నారు.
ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని సీఎం వారికి స్పష్టం చేశారు. తప్పక న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయమై మరోసారి మాట్లాడుతానని, తన వద్దకు రావాలని సీఎం వారికి సూచించారు. ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలంటూ తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment