
కర్నూలు (టౌన్): నగర శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుతున్న సుగాలి ప్రీతి లైంగిక దాడికి, ఆపై హత్య చేయబడిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈనెల 18న కర్నూలుకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కలిశారు. తమ కూతురిపై జరిగిన అఘాయిత్యంపై వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసును సీబీఐకి అప్పగించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గురువారం ప్రభుత్వ కార్యదర్శి కుమార్ విశ్వజీత్ జీవో 37 జారీ చేస్తూ సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐకి అప్పగించడం ద్వారా కుటుంబ సభ్యులు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment