key evidence
-
జత్వానీ కేసులో సర్కారు జిత్తులు!
సాక్షి, అమరావతి : అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్న రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బరితెగిస్తోంది. ఏకంగా న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వలపు వల (హనీట్రాప్)తో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేలా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు ఇటువంటి దుందుడుకు చర్యలకు దిగుతున్నారు.కీలక సాక్ష్యాలు సేకరించిన ఆనాటి పోలీసులుహనీట్రాప్తో కాదంబరి జత్వానీ మోసాలపై 2019 ఫిబ్రవరిలో ఫిర్యాదు వచ్చింది. ఆమె తనను వేధిస్తోందని, జగ్గయ్యపేట వద్ద ఉన్న తన 5 ఎకరాలను ఫోర్జరీ పత్రాలు సృష్టించి మరీ విక్రయించేందుకు యత్నిస్తోందని కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త ఆధారాలతోసహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించిన విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం అనుమతితో ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఆమెను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను ముంబైలోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడకు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు.ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షల నిమిత్తం న్యాయస్థానం అనుమతితో ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. కీలక ఆధారాలైన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఫోరెన్సిక్ లేబొరేటరీలోనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం రాగానే..రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసును నీరుగార్చే కుట్రకు తెరలేచింది. అంతేకాదు.. ఆనాటి ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు ఈ కేసును వక్రీకరిస్తూ టీడీపీ ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. టీడీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల కనుసన్నల్లో ఈ కుట్రను అమలు చేశారు. కాదంబరి జత్వానీతో ఆనాటి ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. అనంతరం ఆమె విజయవాడ వచ్చి గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న తన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అప్పగించాలని కోరారు. ఆమె కోరిందే తడవుగా ప్రస్తుత విజయవాడ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారు. ఫోరెన్సిక్ లేబొరేటరీలో ఉన్న ఆమె ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విజయవాడ తెచ్చేశారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో కీలక ఆధారాలు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలన్న ఆలోచన కూడా పోలీసులు చేయలేదు.దీనిపై కిందిస్థాయి పోలీసు అధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో వాటిని ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. కొద్ది రోజుల్లోనే వాటిని జత్వానీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా పోలీసులను కట్టడి చేయాలని ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కీలక ఆధారాలు ధ్వంసం చేసే కుట్రే!కాదంబరి జత్వానీ కుట్ర, మోసానికి సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకే విజయవాడ పోలీసులు ఆమె ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కేసులో కీలక ఆధారాలను నిందితులకు, మరెవ్వరికీ కూడా అప్పగించకూడదు. కేసు ముగిసేవరకు వాటిని ఫోరెన్సిక్ లేబొరేటరీ లేదా పోలీసులు లేదా న్యాయస్థానం ఆధీనంలోనే ఉంచాలి. కానీ జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించేందుకు నిర్ణయించడం గమనార్హం. -
సీఎం జగన్ పై దాడి కేసులో కీలక ఆధారాలు లభ్యం..
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనలో కీలక ఆధారాలు
సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో విశాఖ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వాసుపల్లి నానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో నాని తప్పిదం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. కీలక ఆధారమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు దృష్టి సారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:49 నిమిషాలకు ఇద్దరు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారని, 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కొంప ముంచిన ఉప్పు చేప ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం అదేబోటులో పనిచేసిన నాని మామ సత్యం.. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేశాడు. దీంతో మంటలు చెలరేగాయి. 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి నిందితులు కారణమయ్యారు. వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణం: సీపీ ఈ కేసుపై సీపీ రవిశంకర్ మీడియాకు వివరించారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణమని పేర్కొన్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి ఫిషింగ్ హార్బర్‌కు వచ్చారు. అల్లిపల్లి వేంకటేష్‌కు చెందిన 887 నంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకుని పార్టీ చేసుకున్నారు. అనంతరం సిగరెట్ తాగి పక్కన ఉన్న 815 నెంబర్ బోటుపై పడేశారు. దీంతో మంటలు చెలరేగి వ్యాపించడంతో గమనించి మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేశామని.. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానతులను విచారించామని సీపీ పేర్కొన్నారు. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారు. విచారణలో భాగంగానే యూట్యూబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశామని సీపీ తెలిపారు. చదవండి: చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది! -
చంద్రబాబు కేసులో తిరుగులేని సాక్ష్యాన్ని సాధించిన సీఐడీ
-
ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్..
సాక్షి, వరంగల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యమయింది. ఈ కేసులో జూనియర్ మెడికో వాంగ్మూలం కీలకంగా మారనుంది. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక విషయాలను బయట పెట్టిన జూనియర్ డాక్టర్.. ప్రీ అనస్థిషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను వెల్లడించారు. పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారణ అయింది. జీఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్ పొందుపరిచినట్లు విచారణలో వెలుగు చూసింది. డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివరించి తనకు సపోర్ట్ చేయాలని అర్ధించిన డాక్టర్ ప్రీతి.. తనపై కుట్ర జరుగుతోందని మానసిక సంఘర్షణకు లోనైంది. ఇదే విషయం లాస్ట్ కాల్లో సహ విద్యార్థికి తన ఆవేదన వెలిబుచ్చింది. డాక్టర్ ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారాని విచారణ బృందం సేకరిస్తోంది. పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణ రుజువు చేస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన చాట్స్ లభ్యమైంది. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా కేసును పోలీసులు అధికారులు బిల్డప్ చేయనున్నారు. సైఫ్ వేధింపులపై సాంకేతిక పరమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. నాలుగు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న సైఫ్ చెప్పిన వివరాలతో అనస్తీషియా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. కౌన్సిలింగ్లో ప్రీతి కన్నీరు పెట్టడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీఎంహెచ్‌లో సైఫ్, అనస్తిషియా డిపార్ట్మెంట్లో హెచ్‌వోడీ వ్యవహారం, ప్రీతి ఆడియోల్లో హెచ్‌వోడి పేరు ప్రస్తావించడాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. సైఫ్, హెచ్‌వోడి నాగార్జున రెడ్డి వ్యవహారాన్ని పోలీసులు ర్యాగింగ్ కోణంలో చూస్తున్నారు. లీవ్, కౌన్సిలింగ్ విషయంలో నాగార్జున్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమయింది. ఇప్పటికే హెచ్‌వోడీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ రోజుతో సైఫ్ నాలుగు రోజుల పోలీసుల కస్టడీ ముగుస్తుంది. కాగా, రేపు(సోమవారం) కోర్టులో సైఫ్‌ను హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు. చదవండి: కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది: సాత్విక్ పేరెంట్స్ -
సాక్షి టీవీ చేతిలో దర్భంగా బ్లాస్ట్ కీలక సాక్ష్యం
-
దిశ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం
-
‘మక్కా’ పేలుడు కేసు.. ఆ ఆధారం ఏమైంది?
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు పేలుడు కేసులో ఎన్ఐఏ వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్న వేళ.. ఓ కీలక ఆధారం గురించి చర్చ మొదలైంది. పేలుడు తర్వాత ఘటనాస్థలం నుంచి ఓ ఎరుపు రంగు టీ షర్ట్‌ను స్థానిక పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కేసులో ఇది కీలకంగా మారే అవకాశం ఉందని అప్పట్లో అంతా భావించారు. అయితే తర్వాత అది కనిపించకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది. 2011లో సీబీఐ నుంచి ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ కాబడింది. ఆ సమయంలో ఆ టీ షర్టును అధికారులు ఎన్ఐఏ బృందానికి అందజేయలేదంట. ఈ విషయాన్ని ఆ సమయంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ డైరెక్టర్(ప్రత్యేక) ఎన్ ఆర్ వాసన్ చెప్పినట్లు ఇప్పుడు ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనం ప్రచురించింది.‘2007 మే 18 నిందితులు రెండు బాంబులతో పేలుళ్లకు యత్నించగా.. ఒక్కటి మాత్రమే పేలింది. ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ బ్యాగ్‌ను స్వాధీనపరుచుకున్నారు. అందులో పేలని బాంబును.. ఓ తాళపు చెవిని, ఓ ఎరుపు రంగు టీషర్ట్ ఉండగా.. వాటిని క్లూస్ టీం స్వాధీనపరుచుకుంది. తాళపుచెవి బహుశా పేలని ఐఈడీ(ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)కు చెందిందని భావించారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో అది దానికి సరితూగకపోవటంతో ఆ ‘కీ’ మిస్టరీగా మిగిలిపోయింది. కానీ, అందులో దొరికిన ఎరుపు టీ షర్ట్ ఏమైందన్నది మాత్రం ఇప్పటిదాకా తేలలేదు. కేసు బదిలీ సమయంలో సీబీఐ ముఖ్యమైన పత్రాలను అందించిందే తప్ప.. ఆ టీషర్ట్‌ను మాకు ఇవ్వలేదు’ అని వాసన్ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. మరోవైపు 2013-బోధ గయ పేలుళ్ల కేసు.. అక్కడ దొరికిన ఓ బ్యాగ్ ఆధారంగానే చేధించబడింది. అందులో లభించిన దుస్తులపై ఉన్న రక్తపు మరకలు.. నిందితుడు హైదర్ అలీ డీఎన్‌ఐతో సరిపోలటంతో కేసు చిక్కుముడి వీడింది. అలాంటప్పుడు మక్కా పేలుళ్ల కేసులో అదృశ్యమైన ఆ ఎరుపు రంగు టీ షర్ట్ కూడా కీలకమే అయి ఉండేదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మక్కా మసీద్ పేలుడు కేసులో తేజ్ పరమార్, రాజేంద్ర చౌదరీలు బాంబులు పెట్టినట్లుగా ఎన్ఐఏ పేర్కొంది. తేజ్ పరమార్ పెట్టిన బాంబు పేలకపోగా.. ఆ బ్యాగునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించింది. అయినప్పటికీ తేజ్ పరమార్ పేరును ఛార్జీ షీట్లో చేర్చకుండా.. పోలీసులు అతన్ని అరెస్ట్ మాత్రం చేశారు. 11 ఏళ్ల దర్యాప్తు తర్వాత సరైన ఆధారాలు లేకపోవటంతో మక్కా మసీద్ పేలుడు కేసును కొట్టేసిన నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. మిగతా వారిపై మాత్రం విచారణ కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది. -
తిరుపతికి బదులు చిత్తూరులో బాంబు పెట్టారు
చిత్తూరు కోర్టు బాంబు పేలుడులో కొత్త కోణం 2013లో పుత్తూరులో తీవ్రవాదుల కేసుకు లింకు తిరుపతికి బదులు చిత్తూరులో పెట్టారు చిత్తూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు కోర్టు బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. చిత్తూరులో బాంబు పెట్టింది ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తొలి నుంచి మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూను అనుమానిస్తూ వచ్చిన పోలీసులకు తాజాగా కొత్త ఆధారాలు లభించాయి. 2013 అక్టోబర్ 5న గేట్ పుత్తూరులోని ముస్లిం వీధిలో తీవ్రవాదులు తల దాచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. తమిళనాడు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా ఆక్టోపస్ బలగాలతో ఆపరేషన్ నిర్వహించారు. ఇస్లామిక్ లిబరేషన్ సంస్థకు చెందిన ఆల్-ఉమ తీవ్రవాదులు బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్ అలియాస్ మహ్మద్ ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి తీసుకెళ్లే గొడుగుల్లో పేలుడు పదార్థాలు పెట్టాలని తీవ్రవాదులు ప్రణాళిక రచించినట్టు తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. అందులో భాగంగానే పుత్తూరులో తల దాచుకున్నట్లు గుర్తించి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో జీనత్‌ఖాన్ అనే కానిస్టేబుల్, ఎస్పీకి అంగరక్షకుడిగా ఉన్న మరో కానిస్టేబుల్ గాయపడ్డారు. భయపెట్టాలనే.. ఏప్రిల్ 7న తిరుపతి కోర్టులో ఉగ్రవాదుల కేసుకు షెడ్యూల్ ఖరారు చేసి విచారణ చేపట్టాల్సి ఉంది. బిలాల్ మాలిక్‌కు సంబంధించిన వ్యక్తులు సెషన్స్ కమిట్ కాకుండా చేయడానికి పేలుడు పదార్థాలు పెట్టి భయాందోళనకు గురి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కేసు విచారణ షెడ్యూల్ చిత్తూరులోని జిల్లా కోర్టులో జరగనుందని భావించిన దుండగులు పేలుడు పదార్థాన్ని అక్కడున్న జీపు కింద ఉంచారు. వాస్తవానికి కేసు కమిట్ తిరుపతిలో జరగాల్సి ఉంది. అది తెలియక చిత్తూరులో బాంబు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బాంబు పేలుడు కేసులో చిక్కుముడి వీడనుంది. -
రాయలు హత్య కేసులో కీలక ఆధారాలు
♦ పోలీసుల అదుపులో నిందితుడు నవీన్ మురళీ ♦ హత్యకు ప్లాన్ చేసింది ఒకరు, హత్య చేసింది నలుగురు ♦ రాయలు హత్య కేసులో తెరపైకి వచ్చిన ప్రభు అనే వ్యక్తి పేరు ♦ రాయలు హత్యకు నిరసనగా ఎల్లుండి న్యాయవాదుల విధుల బహిష్కరణ ♦ రాయలు మృతిపై కాపు నేతల దిగ్ర్భాంతి ఏలూరు: ప్రముఖ న్యాయవాది, కాపు నేత టీడీ రాయలు హత్య కేసులో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు వెల్లడించారు. రాయలు హత్యకేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు నవీన్ మురళీని తమదైన శైలీలో విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాయలు హత్యకు ప్లాన్ చేసింది ఒకరైతే.. హత్య చేసింది నలుగురు అని పోలీసులు నిర్థారించారు. అయితే రాయలు హత్యకేసులో ప్రభు అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ నటుడికి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రభుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రభు తమ్ముడు నవీన్ మురళీని విచారించడంతో తన అన్నయ్య ప్రభు పాత్ర ఉన్నట్టు పోలీసులకు వెల్లడించాడు. దాంతో పరారీలో ఉన్న ప్రభుతోపాటు మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలు హత్యకు నిరసనగా ఎల్లుండి న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. రాయలు మృతిపై కాపు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం టీడీ రాయలు అనే న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఆయనను నరికి చంపారు. స్థానికంగా ఉన్న గాంధీ స్కూల్ సమీపంలోని ఏసీ పరికరాలు విక్రయించే షాపులో రాయలు ఉండగా కాపు కాసిన దుండగులు ఒక్కసారిగా షాపులోకి దూసుకువచ్చి వేటకొడవళ్లతో దాడి చేశారు. రాయలు ఏలూరు పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. రాయలు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బాలిక హత్య కేసు కొలిక్కి!
కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దేవరాపల్లి: దేవరాపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక దివ్య హత్య కేసు దర్యాప్తులో పోలీసులు శుక్రవారం కీలక ఆధారాలు సేకరించిట్లు తెలిసింది. దీంతో హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులను పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిందితులను శుక్రవారం సాయంత్రమే పట్టుకున్నారని, సాయంత్రం చీకటి పడటంతో పాటు క్రిస్మస్ సెలవు దినం కావడంతో అరెస్టు చేయలేదని విశ్వనీయంగా తెలిసింది. వీరిని శనివారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేవరాపల్లి ఎస్ఐ జీఎన్.అప్పన్న కేసు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేసినట్టు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనేదానిపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. క్రైం కేసులను ఛేదించడంలో దిట్టగా పేరున్న ఎస్ఐ అప్పన్న ఆది నుంచి చాలెంజింగ్ తీసుకొని ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు. బాలిక అదృశ్యం అయినట్లు ఫిర్యాదు అందిన మరుక్షణమే గ్రామంలో దండోరా ద్వారా ప్రచారం చేయడమే దీనికి నిదర్శనం. దండోరా వేయించడమే నిందితులను పట్టుకోవడంలో కీలకమైనట్లు తెలుస్తోంది. అనుమానితుడిగా పోలీస్‌లు అదుపులో ఉన్న దివ్యకు వరుసకు మేనమామ అయిన గుణశేఖర్‌ను శుక్రవారం లోతుగా విచారించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడినట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా ముక్కు పచ్చలారని చిన్నారి దివ్యను హత్య చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అల్లారి ముద్దుగా పెంచుకున్న కుమార్తె హత్యకు గురికావడంపై బాలిక తల్లిదండ్రులు మాత్రం తీవ్ర మనోవేదనతో అల్లాడుతున్నారు.