వాట్ యాన్ ఐడియా!
కరువు కాలం.. మోరీ నీరూ వదలం
వర్గల్: తీవ్ర వర్షాభావం.. తాగు నీటి కష్టాలు తెచ్చి పెట్టింది. భూగర్భజలం అడుగంటడంతో గుక్కెడు నీటికి పరితపిస్తున్న గడ్డు కాలం. ఇక నిర్మాణాలకు నీటితిప్పలు చెప్పనలవి కాదు. మురుగు నీటిని సైతం వదలని పరిస్థితి. ఇందుకు మెదక్ జిల్లా వర్గల్ మండలం నెంటూరులో ఏఎన్‌ఎం భవన నిర్మాణ పనులకు మోరీ నీటిని జాగ్రత్తగా వాడుకుంటున్న తీరే నిదర్శనం.
ఊరు నుంచి వచ్చే మోరీ నీళ్లను నిర్మాణ పనులు జరుగుతున్న భవనం సమీపంలో అడ్డుకట్ట వేసి ఇలా ఆపేశారు. ఆ నిల్వ నీటిలో ఓ చిన్న సింగిల్‌ఫేజ్ మోటర్ పెట్టి తోడుకుంటున్నారు. నిర్మాణ పనులకు ‘నీటి’ కరువును అధిగమిస్తున్నారు. వాట్ యాన్ ఐడియా..!!