
సాక్షి, వరంగల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ చిలకమర్రి పార్థసారధి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అప్పటి వరకు తనతోనే ఉన్న అధికారిక వాహన డ్రైవర్ పార్థసారధి మృతి చెందడంతో మంత్రి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. డ్రైవర్ మృతదేహం వద్ద ఆయన విలపించారు. గోపాలపురంలోని పార్థసారధి ఇంటి వద్ద పాడె మోశారు.
అంతిమ యాత్రలో మంత్రితో పాటుగా ఆయన సతీమణి ఉషా, కుమారుడు ప్రేమ్‌చందర్ రావు, సోదరుడు ప్రదీప్‌రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్నారు. పద్మాక్షి సమీపంలో శివముక్తీ ధామ్‌లో పార్థసారధికి అంతిమ సంస్కారం నిర్వహించారు. తుపాకీ కాల్పులతో అధికార లాంఛనాలతో పార్థసారధి అంత్యక్రియలు ముగిశాయి. శనివారం అర్ధరాత్రి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చిటూరు శివారులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని ఓ వాహనం పల్టీ కొట్టడంతో డ్రైవర్ పార్థసారధి, సోషల్ మీడియా ఇన్‌చార్జి పూర్ణేందర్ మృతిచెందిన సంగతి తెలిసిందే.
చదవండి: ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా
Comments
Please login to add a commentAdd a comment