Tenth Paper Leak Case: Bandi Sanjay as A1, Sensational Things In Remand Report - Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Published Wed, Apr 5 2023 5:36 PM | Last Updated on Wed, Apr 5 2023 6:09 PM

Paper Leak Case: Sensational Things In Bandi Sanjay Remand Report - Sakshi

సాక్షి, వరంగల్‌: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్‌ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్‌, ఏ3 మహేష్‌, ఏ4గా మైనర్‌ బాలుడు, ఏ5గా శివగణేష్‌, ఏ6గా పోగు సుభాష్‌, ఏ7గా పొగు శశాంక్‌, ఏ8గా దూలం శ్రీకాంత్‌, ఏ9గా పెరుమాండ శార్మిక్‌, ఏ10గా పోతబోయిన వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు

120(బి) సెక్షన్‌ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు చేర్చారు. బండి సంజయ్‌ సహా ప్రశాంత్‌, మహేష్‌, శివగణేష్‌లను అరెస్ట్‌ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. టెన్త్‌ విద్యార్థికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

‘‘ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్‌ను పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్‌ తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ ప్రాక్టీస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశాం. ఏ4గా మైనర్‌ ఉండటంతో వివరాలు వెల్లడించడం లేదు. టెన్త్‌ హిందీ పేపర్‌ను ప్రశాంత్‌ వైరల్‌ చేశాడు. ఈటల సహా చాలా మంది నేతలకు టెన్త్‌ పేపర్‌ వెళ్లింది. పరీక్షకు ముందు రోజు ప్రశాంత్‌, బండి సంజయ్‌ చాటింగ్‌ జరిగింది’’ అని వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. 

‘‘ప్రశాంత్‌, సంజయ్‌ మధ్య తరుచూ ఫోన్‌ కాల్స్‌ కూడా ఉన్నాయి. బండి సంజయ్‌ ఫోన్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. మెసేజ్‌ షేర్‌ చేసినందుకు ఎవ్వరినీ అరెస్ట్‌ చేయలేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రపన్నారు. చాటింగ్‌ ఆధారంగానే బండి సంజయ్‌ను ఏ1గా చేర్చాం. టెన్త్‌ పేపర్‌ లీక్‌ వెనుక పెద్ద కుట్ర ఉంది. పేపర్‌ లీక్‌పై మీడియాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇస్తున్నారు. బండి సంజయ్‌ ఫోన్‌ లభ్యమైతే మరింత సమాచారం తెలుస్తుంది’’ అని సీపీ పేర్కొన్నారు.
చదవండి: సస్పెన్స్‌ థ్రిల్లర్ సినిమా తలపించేలా.. కోర్టు ముందుకు బండి సంజయ్‌..

‘‘వాట్సాప్‌ మెసేజ్‌లను రిట్రీవ్‌ చేస్తున్నాం. పేపర్‌ లీక్‌ అంతా గేమ్‌ ప్లాన్‌లా చేస్తున్నారు. నమో టీమ్‌లో ఏ2 ప్రశాంత్‌ పని చేస్తున్నారు. బండి సంజయ్‌ అరెస్ట్‌ను లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేశాం. మేం పక్కాగా లీగల్‌ ప్రొసీజర్‌నే ఫాలో అయ్యాం. బండి సంజయ్‌ డైరెక్షన్‌లోనే పేపర్‌ లీకేజీ వ్యవహారం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగింది’’ అని  సీపీ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement