
పార్లమెంట్ భవనం మెట్లకు మొక్కుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: డాబులకు ప్రసిద్ధిగాంచిన చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటన ఆద్యంతం హాస్యాస్పదంగా సాగింది. మంగళవారం ఉదయం సమావేశాల సమయంలో పార్లమెంట్ భవనానికి వచ్చిన ఆయన విచిత్రమైన రీతిలో ఫొటోలకు పోజులిస్తూ కాసేపు హడావిడి చేస్తున్నాననుకున్నారు. సభ తొలివిడత వాయిదా అనంతరం సెంట్రల్ హాలులో చాయ్‌లు తాగడానికి వచ్చిన పలు పార్టీల అధినేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏఐడీఏంకే ఆందోళన నడుమ సభ రేపటికి వాయిదాపడిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేశారు.
వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్..: ఈ సందర్భంగా విలేకరులు మౌళికమైన కీలక ప్రశ్నలు అడగడంతో చంద్రబాబు ఇబ్బందికి గురయ్యారు. ‘‘సార్.. ఏపీకి అన్యాయం జరిగిందంటున్న మీరు నాలుగేళ్లు బీజేపీతో ఎందుకు అంటకాగాల్సి వచ్చింది? కేంద్రం అడిగినట్లు రెవెన్యూలోటు భర్తీ నిధుల లెక్కలు ఎందుకు చూపడంలేదు? ఇప్పడు ప్రత్యేక హోదా కావాలంటున్న మీరు మొన్నటిదాకా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు?అకస్మాత్తుగా ఎన్డీఏ నుంచి బయటికొచ్చి ప్రత్యేక హోదా అడగడంవెనుక మతలబు ఏమైనా ఉందా?..’’ అంటూ విలేకరులు సూటిగా అడిగారు. ఆ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పలేని చంద్రబాబు తనదైన శైలిలో.. ‘వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్..’ అని రివాజుగామారిని సుత్తికొట్టుడు ప్రారంభించారు. తాను బీజేపీని నమ్మానని, వారు మాత్రం ద్రోహం చేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చివరి బడ్జెట్ దాకా వేచి ఉన్నానని, ఇక ఉపేక్షించని స్థితిలోనే ఢిల్లీతో పోరాటానికి దిగానని చంద్రబాబు చెప్పుకొచ్చారు..
Comments
Please login to add a commentAdd a comment