న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి దఫా బడ్జెట్ సమావేశాలు మార్చి 16వరకూ జరుగుతాయి. తొలిరోజు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగిస్తారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29న సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు.
అలాగే ఫిబ్రవరి 26న రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు. 26న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తీసుకు వస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ అనంతరం, వివిధశాఖల పద్దులపై ఆయాశాఖల అధికారులు నివేదికలు రూపొందించేందుకు తొలి విడత సమావేశాలు మార్చి 16న వాయిదా పడతాయి. తిరిగి ఏప్రిల్ 25 నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.