హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఎంటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తాకొట్టడంతో.. బైక్‌పై అరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుంతల కారణంగా నగరంలో ఇప్పటివరకూ ఏడుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.