
హయత్ నగర్ అభ్యర్థిపై కత్తులతో దాడి
హైదరాబాద్: హయత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారుపై రాళ్ల వర్షం కురిపించిన దుండగులు అనంతరం కత్తులతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.
హయత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల చంద్రశేఖర్రావు శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా అనూహ్యంగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కారుపై రాళ్లతో దాడి చేయగా ఆయన తప్పించుకునే ప్రయత్నంలో కత్తితో వెనుక నుంచి దాడి చేశారు. స్వల్పగాయాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.