
కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు సమక్షంలో బీజేడీలో చేరిన 10 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు
బరంపురం:బరంపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 10 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికార బీజేడీలో ఆదివారం చేరారు. అధికార బీజేడీ ఆపరేషన్ ఆకర్‡్ష పేరుతో ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు ఇటీవలే అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేడీలో చేరారు.
బీజేడీలో చేరిన వారు 4వ వార్డు కార్పొరేటర్ అనిల్ నాయక్, 5వ వార్డు కార్పొరేటర్ మురళీకృష్ణ, 6వ వార్డు కార్పొరేటర్ రంజిత్ నాయక్, 20వ వార్డు కార్పొరేటర్ లిల్లి బెహరా, 21వ వార్డు కార్పొరేటర్ గీతా మాధురి, 29వ వార్డు కార్పొరేటర్ సంజుక్త్ పాత్రో, 32వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక చౌదరి, 33వ వార్డు కార్పొరేటర్ ఎమ్.మీనాక్షి, 34వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావు, 40వ వార్డు కార్పొరేటర్ మినతి బిశాయిలు కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ సాహు సమక్షంలో అధికార బీజేడీలో చేరారు. వీరంతా ఈ నెల 4వ తేదీన స్థానిక కళ్లికోట్ మైదానంలో నిర్వహించే మిశ్రమ సమ్మేళన పర్బ్‌లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో అధికారికంగా బీజేడీలో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment