![Sand mafia attacks two VROs in Srikakulam district - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/15/sand-mafia_2.jpg.webp?itok=ipNjWcnE)
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఇసుకు మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిని వెంబడించి మరీ తలలు పగులగొట్టారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నైరాలో చోటుచేసుకుంది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరావు గతరాత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో ఇసుక మాఫియా దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయి కర్రలతో మూకుమ్మడిగా దాడికి చేశారు. ఈ ఘటనలో వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఇసుక మాఫియా దాడులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ సీరియస్ అయ్యారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసినవారిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి, పగలు అనకుండా రెవెన్యూ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. రాజకీయ ఒత్తిడికి లొంగకుండా కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఇసుక మాఫియా దాడిలో గాయపడి, రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోలను జిల్లా కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్ చక్రధర్ బాబు పరామర్శించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
Comments
Please login to add a commentAdd a comment