visweswara rao
-
Comedy Actor Visweswara Rao: ముగ్గురు సీఎంలతో నటించిన కమెడియన్.. అరుదైన ఫోటోలు
-
అంతా కలిసి రండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, అనుకున్న లక్ష్యాల కోసం అంతా కలిసి పోరాటం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎల్పీ నేత భట్టి అధ్యక్షతన జరిగి ఈ భేటీకి సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొ. విశ్వేశ్వరరావ్, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, న్యూ డెమోక్రసీ, టీటీడీపీ, లిబరేషన్ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని భట్టి అఖిలపక్ష నేతలను కోరారు. అన్ని పక్షాలు సూత్రప్రాయంగా మద్దతు తెలిపాయని, అదే విధంగా పోడు భూములు, ఇతర సమస్యలపై కాంగ్రెస్ చేసే పోరాటానికి మద్దతు తెలుపుతామని చెప్పాయన్నారు. ఆయా పార్టీలే కాకుండా వాటి అనుబంధ సంఘాలు కూడా తమతో కలిసి వస్తాయని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం అందరం కలిసి పోరాటం చేశామని, సాధించుకున్న తెలంగాణలో పోరాట లక్ష్యాలు నెరవేరేందుకు మరింతగా పోరాడిల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేసే హక్కు కూడా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు. తాము అసెంబ్లీలో పోరాటం చేస్తున్నామని, మీ అంశాలు తెలియజేస్తే మీ గొంతుకను కూడా శాసనసభలో వినిపిస్తామని భట్టి అన్నారు. సీపీఐ కార్యదర్శి చాడ మాట్లాడుతూ, కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంతోపాటు పోడు భూముల సమస్య పై పోరాటం ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్తో కలసి పోరాటం చేస్తామన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఇవ్వడంలో కేసీఆర్ విఫలం అయ్యారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రతిపక్షాలు కలిసి పనిచేసినట్లుగానే రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
వీఆర్వోలను వెంబడించి మరీ దాడి చేశారు..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఇసుకు మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిని వెంబడించి మరీ తలలు పగులగొట్టారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నైరాలో చోటుచేసుకుంది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరావు గతరాత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో ఇసుక మాఫియా దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయి కర్రలతో మూకుమ్మడిగా దాడికి చేశారు. ఈ ఘటనలో వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఇసుక మాఫియా దాడులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ సీరియస్ అయ్యారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసినవారిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి, పగలు అనకుండా రెవెన్యూ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. రాజకీయ ఒత్తిడికి లొంగకుండా కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఇసుక మాఫియా దాడిలో గాయపడి, రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోలను జిల్లా కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్ చక్రధర్ బాబు పరామర్శించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా -
పురుగులమందు తాగి కౌలురైతు ఆత్మహత్య
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని గోపాలపురానికి చెందిన విశ్వేశ్వర రావు కు చెందిన పంట ఎండిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో అప్పుల తీర్చే మార్గం కనపడక పోవడంతో పురుగుల మందు తాగి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. విశ్వేశ్వర్ రావు మృతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఓయూలో ప్రొ.విశ్వేశ్వరరావు అరెస్ట్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పీ.ఎల్ విశ్వేశ్వరరావును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బీఫ్ ఫెస్టివల్ జరపాలని డిమాండ్ చేస్తూ ఓయూలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీసీ గేట్ వద్దకు ఏబీవీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
వజ్ర కిరీటంపై సమగ్ర విచారణ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అవినీతి ఆరోపణలు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. నగరంలోని ఆర్ఆర్ పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో వజ్రాల కిరీటం వ్యవహారం, మేనేజర్గా పనిచేసిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావుపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై మంత్రి స్పందించారు. ఈవో వ్యవహార శైలిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఆరోపణలు వాస్తవాలేనని నిగ్గుతేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆయన పనితీరుపై తనకు పలుమార్లు ఫిర్యాదులు అందాయని, అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత వ్యవహార శైలిపైనా విమర్శలు రావడంతో వెంటనే బదిలీ చేశామని చెప్పారు. శాఖాపరమైన విచారణను ఈ రీజియన్ అధికారులు చేపడితే అతను కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా ఇతర జిల్లాల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు.