మహిళా ఉద్యోగినులకు లైంగిక వేధింపులు | kanakadurga temple manager faces allegations of workplace harassment | Sakshi
Sakshi News home page

'నేను లోకేశ్ మనిషిని, నన్ను ఏంచేయలేరు'

Published Sat, Jul 16 2016 1:42 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

మహిళా ఉద్యోగినులకు లైంగిక వేధింపులు - Sakshi

మహిళా ఉద్యోగినులకు లైంగిక వేధింపులు

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దుర్గగుడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మేనేజర్ చంద్రశేఖర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమను చంద్రశేఖర్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పలువురు మహిళా ఉద్యోగినులు పోలీసులను ఆశ్రయించారు.

అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తానంటూ చంద్రశేఖర్ బెదిరిస్తున్నాడని మహిళా ఉద్యోగినులు చెబుతున్నారు. 'నేను లోకేశ్ మనిషిని, నన్ను లోకేష్ ఇక్కడ ఉద్యోగంలో పెట్టారు. మీరు ఎంతమందికి ఫిర్యాదు చేసినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు' అని చంద్రశేఖర్ బెదిరిస్తున్నాడని బాధిత మహిళలు వాపోతున్నారు.

మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలుకు చంద్రశేఖర్ స్పందించాడు. సరిగా పని చేయమన్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement