
సిద్ధార్థ ఆస్పత్రిని సీజ్ చేస్తున్న వైద్యాధికారులు
చేవెళ్ల: అనుమతులు లేకుండా గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తున్న రెండు ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి మండల కేంద్రంలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. సిద్దార్థ క్లీనిక్ పేరుతో హోమియోపతి డాక్టర్ హైమావతి నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో గర్భిణులకు స్కా నింగ్‌పరీక్షలు, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో దాడులు చేశారు.
క్లినిక్‌లో 12 మంది గర్భిణులు స్కానింగ్ కోసం రావడాన్ని అధికారులు గమనించారు. అనుమతులులేకుండా స్కానింగ్ చేసినందుకు మిషన్లను సీజ్ చేశారు. మరో ప్రైవేటు ఆస్పత్రి అయిన ప్రజావైద్యశాలలో కూడా ఇదేరకమైన స్కానింగ్ పరీక్షలు జరుగుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీల్లో వైద్యఅధికారులు రాకేశ్, శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌లు, సీహెచ్‌ఓ గోపాల్‌రెడ్డి, చేవెళ్ల ఎస్‌ఐ హయ్యూం, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment