
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
నరేందర్‌రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment