
ఆనకట్ట నిర్మించాల్సిన ప్రాంతం ఇదే
ధారూరు: మండలంలోని దోర్నాల్ గ్రామ సమీపంలో పెద్ద వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మూడేళ్ల క్రితం మంత్రి సబితారెడ్డి ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భూగర్భ జలాలు వృద్ధి కోసం ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించారు. ఉద్దేశం మంచిదే అయినా పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. 2020 జూన్ 11న మండలంలోని పెద్ద వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షాయాభై వేల రూపాయలు మంజూరు చేసింది. వాగు అవతల ఉన్న పొలాలకు దారి సౌకర్యంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని రైతులు భావించారు. కాంట్రాక్టర్ పునాది స్థాయిలో పనులు చేస్తుండగా వాగు ప్రవాహ కారణంగా పనులు ఆపేశాడు. 2 సంవత్సరాలు అవుతున్నా తిరిగి పనులు చేపట్టలేదు. 2020, 2021 సంవత్సరాల్లో ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు. అయితే ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు పూర్తవుతాయని రైతులు భావించడం, ఆ తర్వాత నిరాస చెందడం పరిపాటిగా మారింది.

పనుల ప్రారంభ సమయంలో వేసిన శిలాఫలకం
Comments
Please login to add a commentAdd a comment