
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను రైతులు పంటల చుట్టూ పరదాలుగా కడుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ రైతు గ్రామంలో ఒక్కో బతుకమ్మ చీరను రూ.50 చొప్పున కొని పంటలకు అడవిపందుల నుంచి రక్షణకు పొలం చుట్టూ కట్టాడు. బషీరాబాద్ మండలానికి 11,316 చీరలు వస్తే రేషన్ డీలర్ల దగ్గర ఇప్పటి వరకు 20 శాతం మహిళలే తీసుకువెళ్లారు. దీంతో డీలర్ల దగ్గర చీరలు కుప్పలుగా మిగిలి పోయాయి.